- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
గంజాయి కేసులో నిందితుడు అరెస్ట్..
దిశ, తాండూర్ : తిర్యాని మండలం కైరిగూడ గ్రామ పంచాయతీ పరిధిలోని లచ్చుగూడ కు చెందిన ఆత్రం లింగారావు అనే నిందితుడిని గంజాయి కేసులో అరెస్టు చేసినట్లు రెబ్బెన సీఐ నరేందర్ తెలిపారు. తిర్యాని పోలీస్ స్టేషన్ లో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కేసు వివరాలు సీఐ వెల్లడించారు. నమ్మదగిన సమాచారం మేరకు తిర్యాని తహసీల్దార్ ఆధ్వర్యంలో ఎస్సై రమేష్ సిబ్బందితో కలిసి లింగారావు ఇంట్లో తనిఖీలు నిర్వహించారు. తన సొంత అవసరాలకు, తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు సంపాదించాలన్న దురుద్దేశంతో గత ఐదు నెలల క్రితం గుర్తు తెలియని వ్యక్తి దగ్గర గంజాయి విత్తనాలు తెచ్చి తన ఇంటి వెనకాల గల పెరడులో నాటారు. తహసీల్దార్ ఆధ్వర్యంలో పంచనామా నిర్వహించి సుమారు 9 కిలోలు గల ఐదు గంజాయి మొక్కలు స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి నిందితుడిని రిమాండ్ కు తరలించనున్నట్లు సీఐ వివరించారు. ఎవరైనా ప్రభుత్వ నిషేధిత గంజాయిని సాగు చేసిన, సేవించిన, సరఫరా చేసిన శాఖ పరంగా చర్యలు తప్పవని సీఐ హెచ్చరించారు. సమావేశంలో ఎస్సై రమేష్ పాల్గొన్నారు.
Read More..