Missing : పెనుగంగా నదిలో యువకుడు గల్లంతు

by Aamani |
Missing : పెనుగంగా నదిలో యువకుడు గల్లంతు
X

దిశ,ఆదిలాబాద్ : ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలంలోని డొల్లార వద్ద పెన్ గంగా నదిలో ఓ యువకుడు గల్లంతయ్యాడు. ఆదివారం అర్ధరాత్రి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో సోమవారం ఉదయం గాలింపు చర్యలను చేపట్టారు. యువకుడి ఆచూకీ కోసం డిడిఆర్ఎఫ్ బృందం రంగంలోకి దిగింది. పెన్ గంగా నది వద్ద విస్తృతంగా గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.అయితే గల్లంతైన యువకుడు చాంద (టీ) కు చెందిన శివగా పోలీసులు గుర్తించారు. కాగా ఈ గాలింపు చర్యలను ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ గౌస్ ఆలం పరిశీలించారు. ఎస్పీ వెంట సీఐ సాయినాథ్ ఎస్సై పురుషోత్తం ఉన్నారు.

Advertisement

Next Story

Most Viewed