అక్రమ ఇసుక తరలించినందుకు ఎంత ఫెనాల్టీ కట్టారో తెలుసా..

by Sumithra |
అక్రమ ఇసుక తరలించినందుకు ఎంత ఫెనాల్టీ కట్టారో తెలుసా..
X

దిశ, సారంగాపూర్ : సారంగాపూర్ మండలంలోని గోడిసెరా వాగు నుండి అక్రమంగా ఇసుక తరలిస్తున్నటీఎస్ 18బీ 4785 నంబర్ గల ట్రాక్టర్ను గురువారం రెవెన్యూ సిబ్బంది పట్టుకొని తాసిల్దార్ కార్యాలయానికి తీసుకువచ్చారు.

ట్రాక్టర్ యజమానిని పిలిపించి 5000 రూపాయల పెనాల్టీ విధించారు. ప్రభుత్వ అనుమతి లేకుండా ఇసుకను తరలించినట్లు పునరావృతమైనట్లయితే పెనాల్టీతో పాటు క్రిమినల్ కేసు నమోదు చేస్తామని తహసిల్దార్ సంతోష్ రెడ్డి తెలిపారు. ఎవరైనా అక్రమంగా ఇసుక తరలించినట్లయితే వెంటనే 9885949414 నంబర్ గల చరవానికి సమాచారం అందించాలని తెలిపారు.

Advertisement

Next Story