- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కుక్క దాడిలో నాలుగేళ్ల పాపకు గాయాలు
by Shiva |
X
దిశ, కడం: కుక్కల దాడిలో నాలుగేళ్ల పాపకు తీవ్ర గాయలైన ఘటన మండల పరిధిలోని చిన్న బెల్లాల్ గ్రామంలో ఆదివారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. గ్రామానికి చెందిన గోపు సుహాసిని (4) ఇంటి వద్ద ఆడుకుంటున్న క్రమంలో ఓ కుక్క పాపపై దాడి చేసింది. ఈ ఘటనలో పాపకు చెంపపై తీవ్ర గాయమైంది. మెరుగైన వైద్యం కోసం కుటుంబ సభ్యులు చిన్నారిని కడెం మండల కేంద్రంలోని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కానీ మండల కేంద్రంలోని ప్రభుత్వాసుపత్రిలో వైద్యులు, సిబ్బంది లేకపోవడంతో పాప తల్లిదండ్రులు రెండు గంటల వేచి చూసి ఆసుపత్రి అటెండర్ ఫోన్ చేయగా ఆసుపత్రి సిబ్బంది వచ్చి పాపకు వ్యాక్సిన్ వేశారు. ఆసుపత్రిలో అందుబాటులో లేని ఇన్ చార్జ్ వైద్యుడు, వైద్య సిబ్బందిపై పాప తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సమయపాలన పాటించని కడెం ప్రభుత్వాసుపత్రి సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
Advertisement
Next Story