- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఐదేళ్ల బాలుడి కిడ్నీలో అంత పెద్దరాయా..
దిశ ప్రతినిధి, నిర్మల్ : ఐదేళ్ల వయసున్న బాలుడి కిడ్నీలో భారీ సైజులో పెద్ద రాయి ఏర్పడింది. నొప్పితో నరకయాతన అనుభవిస్తున్న ఆ చిన్నారిని పట్టుకుని కుటుంబ సభ్యులు ఎక్కడికి తిరిగినా ఫలితం దక్కలేదు. చివరకు నిర్మల్‌లోని స్వప్న ఆసుపత్రిలో చేరగా శనివారం అరుదైన ఆపరేషన్ చేసిన వైద్యులు ఆ రాయిని తొలగించారు.
సంబంధిత ఆపరేషన్ వివరాలను ఆసుపత్రి వైద్యులు నాళం శశికాంత్, యూరాలకిస్ట్ శ్రావణ్ లు వివరించారు. ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడకు చెందిన ఆమిర్ (05)కు కిడ్నీలో పెద్దసైజులో రాయిఉన్నట్లు గుర్తించామన్నారు. తమది పేదకుటుంబమని, ఆపరేషన్‌కు తమవద్ద డబ్బులు లేవని తల్లిదండ్రులు చెప్పడంతో ‘ఆరోగ్య శ్రీ’ కింద ఈ ఆపరేషన్ పూర్తిచేశామన్నారు. ప్రస్తుతం ఆమిర్ ఆరోగ్యంగా ఉన్నాడని వైద్యులు వివరించారు. హైదరాబాద్ వంటి నగరాలలో చేసే ఇలాంటి అరుదైన ఆపరేషన్లు తమ ఆసుపత్రిలో చేస్తున్నామని చెప్పారు.