అడిషనల్ డీఎంఈ మెరిట్ లిస్టు రిలీజ్

by GSrikanth |
అడిషనల్ డీఎంఈ మెరిట్ లిస్టు రిలీజ్
X

దిశ, తెలంగాణ బ్యూరో: సవరించిన అడిషనల్‌ డీఎంఈల మెరిట్‌ లిస్టును వైద్యారోగ్యశాఖ విడుదల చేసింది.18 మంది అధికారులతో జాబితాను రిలీజ్ చేశారు. ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే ఈ నెల 29వ తేదీలోపు తమకు అందజేయాలని డీఎంఈ త్రివేణి గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం డీఎంఈ, డీఎంఈ (అకడమిక్‌) పోస్టుల్లో ఇంఛార్జీలు కొనసాగుతున్నారు. సీనియార్టీని పక్కనబెట్టి జూనియర్లను డీఎంఈలుగా నియమించడంపై దాఖలైన పిటిషన్‌పై హైకోర్టు వచ్చేనెల 5న విచారణ జరుపనున్నది.

Advertisement

Next Story