నేతల రాకతో పార్టీలు పటిష్టం కావు.. కేకే రాకపై అద్దంకి రియాక్షన్

by GSrikanth |
నేతల రాకతో పార్టీలు పటిష్టం కావు.. కేకే రాకపై అద్దంకి రియాక్షన్
X

దిశ, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్ కీలక నేత, రాజ్యసభ సభ్యుడు కే.కేశవరావు కాంగ్రెస్‌లో చేరిక దాదాపు ఖాయమైంది. ఇదే విషయంలో గురువారం కేసీఆర్‌తో జరిపిన చర్చల్లో తేల్చి చెప్పారు. బీఆర్ఎస్‌లో తనకు ప్రాధాన్యత దక్కడం లేదని, కాంగ్రెస్ చేరడానికి నిర్ణయం తీసుకున్నాని కేసీఆర్‌తో చెప్పినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కేకే నిర్ణయంపై కేసీఆర్ కూడా మండిపడ్డారని తెలుస్తోంది. ఇదిలా ఉండగా.. కేకే కాంగ్రెస్‌లో చేరికపై ఆ పార్టీ నేత, అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్ స్పందించారు. గురువారం సాయంత్రం ఓ మీడియా ఛానల్ ప్రతినిధితో మాట్లాడుతూ.. నేతల రాకతో పార్టీలు పటిష్టం కావని అన్నారు. అధికారం పరమావధిగా పనిచేస్తారని చెప్పారు. కార్యకర్తలుగా తాము చాలా ఏళ్లుగా ప్రజల్లో ఉన్నామని అన్నారు. ఇప్పుడప్పుడే ఇక కాంగ్రెస్‌ను ఎవరూ ఏం చేయలేరని ధీమా వ్యక్తం చేశారు. పార్లమెంట్ ఎన్నికల్లో మెజార్టీ సీట్లు దక్కించుకుంటామని అన్నారు.

Advertisement

Next Story