- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కాంగ్రెస్ అధిష్టానానికి అద్దంకి దయాకర్ కీలక డిమాండ్
దిశ, తెలంగాణ బ్యూరో: ఉదయపూర్ డిక్లరేషన్‌ను తెలంగాణ రాష్ట్రంలో అమలు చేయాలని అధిష్టానం దృష్టికి తీసుకెళ్లినట్లు కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్ తెలిపారు. రాజకీయమైన పదవులు, పార్టీ పదవులు, రాజ్యాంగ పదవుల్లో న్యాయం చేయాలని కోరామని, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలు కాంగ్రెస్ పార్టీకి దూరం కావడానికి గల కారణాలపై చర్చించామని పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల ఆకాంక్షను కాంగ్రెస్ అధిష్టానానికి తెలియజేసేందుకు ఢిల్లీకి వచ్చామని అద్దంకి దయాకర్చెప్పారు. రాష్ట్రంలో రాజకీయ పదవుల్లోనూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలు సమస్యలు ఎదుర్కొంటున్నాయని, బీసీలకు రాజకీయ పదవులతో పాటు, వచ్చే ఎన్నికల్లో 50% సీట్లు కేటాయించాలని అడిగామని చెప్పారు. ధరణి వల్ల తెలంగాణలో దళితులు, గిరిజనులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, గత ఎనిమిది సంవత్సరాల్లో టీఆర్ఎస్ పార్టీ ధన రాజకీయాలకు పాల్పడుతోందని ఆరోపించారు. క్షేత్రస్థాయిలో అన్ని వర్గాలకు లాభం చేకూర్చింది కాంగ్రెస్ పార్టీనేనని, భారత్ జోడో యాత్ర సందేశాన్ని ప్రతి గల్లి గల్లికీ తీసుకెళ్తామని అద్దంకి దయాకర్వెల్లడించారు.