Addanki Dayakar: అరెకపూడిని ఆంధ్రోడు అనడం హాస్యాస్పదం

by Gantepaka Srikanth |
Addanki Dayakar Says Takes His Words back  On Komatireddy Venkat Reddy
X

దిశ, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్(Addanki Dayakar) తీవ్ర విమర్శలు చేశారు. గురువారం అరికేపూడి గాంధీ(Arekapudi Gandhi) పదేళ్లు బీఆర్‌ఎస్‌లో ఉన్నారని గుర్తుచేశారు. కౌశిక్‌రెడ్డి(Kaushik Reddy) వ్యాఖ్యలపై కేసీఆర్‌ స్పందించాలని డిమాండ్ చేశారు. సెంటిమెంట్‌తో పబ్బంగడుపుకున్న వాళ్లను.. పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని అన్నారు. కేసీఆర్‌(KCR) ఓట్ల కోసం ఆంధ్రోళ్లను వాడుకున్నారని కీలక ఆరోపణలు చేశారు. బీఆర్ఎస్‌లో రాజకీయ సంక్షోభం నెలకొందని అన్నారు.

కేసీఆర్ స్పందించపోతే.. కౌశిక్ రెడ్డితో అలా మాట్లాడించారని అందరూ అనుకుంటారని చెప్పారు. సెంటిమెంట్‌ను వాడుకుని పబ్బం గడుపుకున్న వాళ్లను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని అన్నారు. ఆంధ్రోళ్ల కాళ్లకు ముళ్లు గుచ్చుకుంటే తాను తీస్తానని కేసీఆర్ అన్నారని చెప్పారని గుర్తుచేశారు. అనంతరం ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ.. పాడి కౌశిక్ రెడ్డి తెలంగాణ సెంటిమెంటును రెచ్చగొట్టడానికి ప్రయత్నిస్తున్నారని అన్నారు. ఆంధ్రా సెటిలర్స్ బతకడానికి వచ్చారని అవమానించేలా కౌశిక్ రెడ్డి మాట్లాడారని చెప్పారని మండిపడ్డారు.

Advertisement

Next Story

Most Viewed