ఓ ముళ్లపంది తెలంగాణకొచ్చి రాజ్యాంగాన్ని రద్దు చేస్తా అంటుండు: అద్దంకి దయాకర్

by Disha Web Desk 9 |
ఓ ముళ్లపంది తెలంగాణకొచ్చి రాజ్యాంగాన్ని రద్దు చేస్తా అంటుండు: అద్దంకి దయాకర్
X

దిశ, వెబ్‌డెస్క్: కేంద్ర హోం మంత్రి అమిత్ షా పై టీపీసీసీ ప్రధాన కార్యదర్శి అద్దంకి దయాకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా అద్దంకి దయాకర్ మాట్లాడుతూ.. అమిత్ షా నువ్వు రిజర్వేషన్లు ఎత్తివేస్తానని చెప్పలేదా అని గొంతెత్తి ప్రశ్నించారు. రాజ్యాంగాన్ని రద్దు చేస్తే బీజేపీని పాతాళానికి తొక్కుడే అనే విషయాన్ని గుర్తు పెట్టుకోండని సవాల్ విసిరారు. అమిత్ షా అనే ఒక ముళ్లపంది తెలంగాణకు వచ్చి రాజ్యాంగాన్ని రద్దు చేస్తానని అంటున్నాడని మండిపడ్డారు. రాజ్యాంగాన్ని రద్దు చేస్తావారా దరిద్రుడా అని అన్నారు. అలాగే అద్దంకి దయాకర్ ప్రధాని మోడీపై కూడా విరుచుకుపడ్డారు. మోడీ భార్యను కూడా ఏలుకోలేనోడు దేశాన్ని ఎలా ఏలగలడంటూ విమర్శలు చేశారు. కాగా ఆలోచించి ఓటు వేయాలని ప్రజల్ని కోరారు.

Next Story

Most Viewed