- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
భార్యపై అనుమానం.. ప్రైవేట్ పార్ట్ కట్ చేసి తాళం వేసిన భర్త.. ఒళ్లు గగుర్పొడిచే ఘటన
దిశ, డైనమిక్ బ్యూరో: తన భార్య మరో వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుందనే అనుమానంతో ఓ భర్త రాక్షసంగా వ్యవహరించిన ఘటన మహారాష్ట్రలో కలకలం రేపింది. భార్య జననాంగాన్ని బ్లేడ్ తో కోసి దానికి ఇనుప రాడ్డుతో తాళం వేసి కృూరంగా వ్యవహరించాడు. ఒళ్లు గగుర్పాటుకు గురిచేసే ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. నేపాల్ కు చెందిన ఉపేంద్ర (30) అనే వ్యక్తి తన భార్య(28)తో లిసి పింప్రి-చించ్‌వాడ్‌లో నివాసం ఉంటున్నాడు. ఉపేంద్ర వాచ్ మెన్ గా పని చేస్తుంటే అతడి భార్య గృహిణి. ఇటీవల తన భార్యపై అనుమానం పెంచుకున్న ఉపేంద్ర ఆమెను రోజు కొడుతూ హింసిస్తూండేవాడు. ఈ క్రమంలో మే 11వ తేదీన ఉపేంద్ర తన భార్య కాళ్లు, చేతులను కట్టేసి తీవ్రంగా దాడి చేశారు. అంతటితో ఆగకుండా పదునైన వస్తువుతో ఆమె ప్రైవేట్ పార్ట్ కు రెండు రంధ్రాలు చేసి ఇనుమ రాడ్డుతో తాళం వేశాడు. భర్త కృూరమైన దాడిలో సదరు మహిళ తీవ్ర రక్తస్రావంతో విలవిలలాడి పోయింది. సాయం కోసం గట్టిగా కేకలు వేయగా పొరుగింటివారు ఆమెను వెంటనే ఆసుపత్రికి తరలించారు. రెండు గంటల పాటు సర్జరీ చేసి వైద్యులు ఆమెకు బిగించిన ఇనుప రాడ్లతో కూడిన తాళాన్ని తొలగించారు. ప్రస్తుతం ఆమెకు వైద్య చికిత్స కొనసాగుతోంది. అనంతరం పొరుగువారి సాయంతో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు ఉపేంద్రను అరెస్ట్ చేసి పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.