Addanki Dayakar: కోమటిరెడ్డి బ్రదర్స్‌పై అద్దంకి దయాకర్ కీలక వ్యాఖ్యలు..

by Shiva |   ( Updated:2025-03-10 03:10:14.0  )
Addanki Dayakar: కోమటిరెడ్డి బ్రదర్స్‌పై అద్దంకి దయాకర్ కీలక వ్యాఖ్యలు..
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ (Telangana)లో కాంగ్రెస్‌ (Congress) ఎమ్మెల్సీ అభ్యర్థులను ఆ పార్టీ అధిష్ఠానం ఆదివారం ఖరారు చేసింది. నాలుగు స్థానాల్లో ఒక స్థానాన్ని సీపీఐ (CPI)కి కేటాయించింది. మిగిలిన మూడు స్థానాలకు కాంగ్రెస్‌ అభ్యర్థులుగా అద్దంకి దయాకర్‌ (Addanki Dayakar), శంకర్‌ నాయక్‌ (Shankar Nayak), విజయశాంతి (Vijayashanthi) పేర్లను ఖరారు చేస్తూ ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ (KC Venugopal) ఉత్తర్వులు జారీ చేశారు. ఈ క్రమంలోనే తనకు ఎమ్మెల్సీ పదవి రావడం కాంగ్రెస్ సీనియర్ నేత అద్దంకి దయాకర్ (Addanki Dayakar) స్పందించారు.

ఎమ్మెల్సీ పదవిని తాను గిఫ్ట్‌గా భావిస్తున్నానని తెలిపారు. ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy), కాంగ్రెస్ పెద్దలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. 20 ఏళ్ల తన ప్రజా జీవితానికి గౌరవం దక్కిందని కామెంట్ చేశారు. పార్టీ కోసం నిబద్ధతతో పని చేస్తే అవకాశాలు వస్తాయని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) తనకు ఎంతగానో సపోర్ట్ చేశారని తెలిపారు. ఇక నుంచి నిత్యం ప్రజల మధ్యే ఉంటూ వారి కోసమే పని చేస్తానని స్పష్టం చేశారు. అదేవిధంగా నల్లగొండ (Nalgonda) జిల్లా నేతలు, కోమటి‌రెడ్డి బ్రదర్స్‌ (Komatireddy Brothers)‌తో తనకు ఎలాంటి విభేదాలు లేవని.. ఇక ముందు కూడా ఉండబోవని స్పష్టం చేశారు. కేబినెట్ పదవిపై తనకు అశలు లేవని అద్దంకి దయాకర్ అన్నారు.

Next Story