- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Car Accedent: రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రమాదం.. డివైడర్ ను ఢీకొట్టిన కారు
దిశ, డైనమిక్ బ్యూరో: హైదరాబాద్ రాయదుర్గం ప్రాంతంలో కారు వేగంగా దూసుకెళ్లి డివైడర్ ను ఢీ కొట్టడంతో ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదంలో ఆరుగురికి తీవ్రంగా గాయాలు అయ్యాయి. ఎర్రగడ్డ కు చెందిన ఆరుగురు వ్యక్తులు కారులో మొయినాబాద్ ఫాంహౌజ్ కు వెళుతున్నారు. మార్గమద్యంలో రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో కారు అదుపుతప్పి డివైడర్ ను ఢీ కోట్టింది. వేగంగా వెళ్లి ఢీ కొట్టడంతో కారు పూర్తిగా ధ్వంసమైంది. ఈ ప్రమాదంలో ముందు భాగంలో ఉన్న వ్యక్తులు కారులో ఇరుక్కుపోయారు. జీహెచ్ఎంసీ సిబ్బంది స్థానికుల సాయంతో కారులో ఉన్న వ్యక్తులను బయటకి తీశారు. అనంతరం క్షతగాత్రులను దగ్గరలో ఉన్న కాంటినెంటల్ ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో కారులో ఉన్న ఆరుగురు వ్యక్తులకు గాయాలు అయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.