- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
ACB: ఇక ‘ఏస్ నెక్స్ట్’ వంతు.. ఫార్ములా-ఈ రేస్ కేసులో ఏసీబీ నోటీసులు

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ పాలిటిక్స్‌లో కాకరేపుతున్న ఫార్ములా -ఈ కార్ రేస్ కేసులో (Formula- E Car Race) కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ఇవాళ కేటీఆర్‌ను ఈడీ విచారిస్తుండగానే ఏసీబీ దూకుడు పెంచింది. ఈ రేస్ నిర్వహణలో తొలి ప్రమోటర్ గ్రీన్ కో (Greenuco) అనుబంధ సంస్థ అయిన ఏస్ నెక్ట్స్ జెన్‌కు (Ace Next Gen) నోటీసులు ఇచ్చింది. ఈ నెల 18వ తేదీన విచారణకు రావాలని నోటీసులు జారీ చేసింది. ఈ కేసులో ఇప్పటికే మాజీ మంత్రి కేటీఆర్, సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, హెచ్ఎండీఏ రిటైర్డ్ చీఫ్ ఇంజినీర్ బీఎల్ ఎన్ రెడ్డిలను ఏసీబీ విచారించిన సంగతి తెలిసిందే. ఇక మలివిడత విచారణలో భాగంగా సీజన్ -9 రేస్‌కు ప్రమోటర్‌గా ఉన్న ఏస్ నెక్ట్స్ జెన్ నష్టాలను చూపిస్తూ సీజన్-10 నుంచి తప్పుకుంది. అయినా గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఏస్ నెక్ట్స్‌పై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఈ వ్యవహారంపై ఏసీబీ (ACB) ఫోకస్ సారించింది.