TS: రాష్ట్రవ్యాప్తంగా ఎలక్షన్ కోడ్ ఎత్తివేత

by GSrikanth |
TS: రాష్ట్రవ్యాప్తంగా ఎలక్షన్ కోడ్ ఎత్తివేత
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రవ్యాప్తంగా ఎలక్షన్ కోడ్‌ను ఎత్తివేసినట్లు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. ఎలక్షన్ ప్రాసెస్ కంప్లీట్ కావడంతో తక్షణం ఇది అమల్లోకి వస్తుందని పేర్కొన్నది. దీంతో ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఇంతకాలం చేసిన వాహనాల తనిఖీలు, చెక్‌పోస్టులు తదితరాలన్నీ ఆగిపోయినట్లయింది. ప్రతీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో కోడ్ అమల్లోకి రావడం ఒక నిబంధన. కేంద్ర ఎలక్షన్ కమిషన్ షెడ్యూలు విడుదల చేయడంతోనే రాష్ట్రమంతా కోడ్ (ఎన్నికల ప్రవర్తనా నియమావళి) అమల్లోకి వస్తుంది. ఎలక్షన్ ప్రాసెస్ ముగిసిన తర్వాత క్లోజ్ అవుతుంది. ఆ ప్రకారం అక్టోబరు 9న తెలంగాణలో అమల్లోకి వచ్చిన కోడ్ డిసెంబరు 4న ఎత్తివేస్తున్నట్లు కమిషన్ ప్రకటించింది.

Advertisement

Next Story