ఎత్తు తక్కువుంటే constable జాబ్ రాదని ఓ యువతి ఏం చేసిందో తెలుసా?

by Javid Pasha |   ( Updated:2022-12-14 09:53:34.0  )
ఎత్తు తక్కువుంటే constable జాబ్ రాదని ఓ యువతి ఏం చేసిందో తెలుసా?
X

దిశ, మహబూబ్ నగర్: కానిస్టేబుల్ దేహ దారుఢ్య పరీక్షలో ఓ యువతి ఎలాగైనా నెగ్గాలనుకుంది. అయితే ఎత్తు తక్కువుంటే జాబ్ రాదని తెలిసి ఓ ఉపాయాన్ని ఆలోచించింది. బుధవారం జరిగిన దేహధారుఢ్య పరీక్షలో తన ప్లాన్ ను అమలు చేసే క్రమంలో అధికారులకు అడ్డంగా దొరికింది. వివరాల్లోకి వెళ్తే.. మూడు రోజులుగా స్థానిక స్టేడియం గ్రౌండ్ లో మహిళా కానిస్టేబుల్ అభ్యర్థులకు దేహదారుఢ్య పరీక్షలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే ఈ పరీక్షలకు హాజరైన ఓ యువతి ఎత్తు పరీక్షలో పాసవ్వాలని తల వెంట్రుకల కింద 'ఎం సీల్' మైనం పెట్టుకుని ఎత్తు కొలిచే ఎలక్ట్రానిక్ యంత్రంపై నిల్చుంది. అయితే ఎలక్ట్రానిక్ యంత్రానికి చెందిన సెన్సార్ స్పందించకపోవడంతో అనుమానం వచ్చిన మహిళా అధికారి.. సదరు అభ్యర్థి తలను పరిశీలించారు.


ఈ క్రమంలోనే ఆమె తలపై 'ఎం సీల్' మైనాన్ని గుర్తించారు. తలపై ఉబ్బెత్తుగా మైనం పెట్టుకొని మోసం చేయాలని ప్రయత్నించిన ఆ అభ్యర్థిని పరీక్ష నుంచి డిస్ క్వాలిఫై చేశారు. జిల్లా ఎస్పీ ఆర్.వెంకటేశ్వర్లు సదరు అభ్యర్థిని మందలించి క్లాస్ తీసుకున్నారు. పరీక్షలో అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలుంటాయని ఆయన హెచ్చరించారు.


Advertisement

Next Story

Most Viewed