చోరీ చేస్తుండగా హుండీలో ఇరుక్కుపోయిన దొంగ చెయ్యి.. వీడియో వైరల్

by Prasad Jukanti |
చోరీ చేస్తుండగా హుండీలో ఇరుక్కుపోయిన దొంగ చెయ్యి.. వీడియో వైరల్
X

దిశ, డైనమిక్ బ్యూరో:గుడిలో చోటీరికి ప్రయత్నించి హుండీలో చెయి ఇరుక్కోవడంతో అడ్డంగా బుక్ అయ్యాడు ఓ దొంగ. కామారెడ్డి జిల్లా బిక్నూర్ మండలంలో చోటు చేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది. మండలంలోని రామేశ్వరపల్లిలోని మాసుపల్లి పోచమ్మ ఆలయంలో పని చేసే సురేశ్ హుండి దొంగతనానికి ప్రయత్నించాడు. దీనికోసం హుండీపై భాగాన్ని ధ్వంసం చేసి అందులోని భక్తులు సమర్పించిన కానుకలను ఎత్తుకెళ్దామని భావించాడు. అయితే డబ్బు కోసం ప్రయత్నిస్తుండగా తన చెయి హుండీలోనే ఇరుక్కుపోయింది. దీంతో తప్పించుకునే మార్గం లేక అక్కడే ఉండిపోయాడు. ఉదయం గుడికి వచ్చిన భక్తులు ఈ వ్యవహారం గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు.

Advertisement

Next Story

Most Viewed