- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
డీఎస్సీ 2024లో హిందీ పండితులకు ఊరట
దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో నిర్వహించిన ఉపాధ్యాయుల నియామక పరీక్ష డీఎస్సీ 2024లో హిందీ పండితులకు హైకోర్టు ద్వారా ఊరట లభించింది. ఎన్‌సీటీఈ నిబంధనలు అంటూ దక్షిణ భారత హిందీ ప్రచారసభ మద్రాస్ సర్టిఫికెట్ చెల్లుబాటు కాదని కొన్ని జిల్లాల విద్యాశాఖాధికారులు ఫలితాలు వచ్చిన తరువాత కూడా అభ్యర్థులకు నియామకాల్లో హిందీ పండితులకు మొండిచేయి చూపించారు. కాగా దీనిపై పలువురు హిందీ పండితులు హైకోర్టును ఆశ్రయించారు. కోర్టు పరిశీలించి దక్షిణభారత హిందీ ప్రచారసభ మద్రాస్ ద్వారా చేసిన కోర్సు చెల్లుబాటు అవుతుందని, దానికి యూజీసీ గుర్తింపు కూడా ఉందని తేల్చింది.
డీఎస్సీ 2024లో అర్హులుగా పరిగణించి వారికి న్యాయం చేయాలని తీర్పు వెలువరించింది. అనంతరం గురువారం విద్యాశాఖ సెక్రటరీని రాష్ట్రీయ ఉపాధ్యాయ పండిత పరిషత్ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జగదీశ్ కలిసి వినతి అందజేశారు. కాగా కోర్టు తీర్పు ఆధారంగా అభ్యర్థులకు న్యాయం చేసేందుకు చర్యలు తీసుకుంటామని విద్యాశాఖ సెక్రటరీ హమీ ఇచ్చారని జగదీశ్ తెలిపారు. ఆయన వెంట సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు సీవీ రమణాచార్యులు, ప్రచార కార్యదర్శి లింగం ఉన్నారు.