వందేమాతరం రైలును ఢీ కొట్టవద్దంటూ బర్రెలకు వినతి పత్రం

by samatah |   ( Updated:2023-04-08 06:34:06.0  )
వందేమాతరం రైలును ఢీ కొట్టవద్దంటూ బర్రెలకు వినతి పత్రం
X

దిశ, వెబ్‌డెస్క్ : నేడు హైదరాబాద్‌లో ప్రధాని మోదీ పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా మోదీ.. సికింద్రాబాద్ టు తిరుపతి వందే భారత్ రైలుతో పాటు పలు అభివృద్ధి పనులను ప్రారంభించనున్నారు. అనంతరం సికింద్రబాద్ పరేడ్ గ్రౌండ్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించనున్నారు. అయితే ఈ సారీ కూడా మోదీ పర్యటనలో కేసీఆర్ పాల్గొనడం లేదంట, బేగంపేట విమానాశ్రయంలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్వాగతం పలకనున్నట్లు సమాచారం.

ఇక ప్రధాని పర్యటన నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ నిరసనలకు పిలుపునిచ్చింది. బర్రెలకు వినతి పత్రాలు ఇస్తూ నిరసన తెలిపారు, బీఆర్ఎస్ పార్టీ నేతలు. వందే భారత్ ట్రైన్‌ను ఢీ కొట్టకుండా.. కాపాడు అంటూ బర్రెలకు వినతులు ఇచ్చారు. ప్రస్తుతం ఈ న్యూస్ నెట్టింట్లో తెగ వైరల్ అవుతుంది.

Advertisement

Next Story

Most Viewed