- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
TG: ఇందిరమ్మ ఇళ్లు రాలేదని పురుగుల మందు తాగిన నాగేశ్వర రావు

దిశ, వెబ్‌డెస్క్: ములుగు(Mulugu) జిల్లా కన్నాయిగూడెం మండలం బుట్టాయిగూడెంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఇందిరమ్మ ఇళ్లు(indiramma illu), రేషన్ కార్డు(Ration Cards)ల జారీకి అర్హులను గుర్తించేందుకు గురువారం నిర్వహించిన గ్రామసభ(Grama Sabha)లో కలకలం రేగింది. తనకు ఇందిరమ్మ ఇళ్లు రాలేదని నాగేశ్వరరావు అనే వ్యక్తి ఏకంగా గ్రామసభలోనే పురుగుల మందు తాగాడు. వెంటనే అప్రమత్తమైన అధికారులు, పోలీసుల సహాయంతో నాగేశ్వర రావు(Nageswara Rao)ను స్థానిక ఆసుపత్రికి తరలించారు. కాగా, రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్న ఈ గ్రామసభల్లో అన్ని చోట్లా గందరగోళాలు చోటుచేసుకుంటున్నాయి. ఎక్కడా సభలు సజావుగా జరగడం లేనట్లు సమచారం.
అర్హులను గుర్తించడం లేదంటూ లబ్ధిదారులు ఆందోళనలు వ్యక్తమవుతున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ సర్కార్(Congress Govt) అధికారంలో వచ్చిన తర్వాత రేషన్ కార్డులు ఇస్తామని ప్రకటించడంతో ప్రజలు పెద్ద ఎత్తున రెవెన్యూ అధికారులకు దరఖాస్తులు అందజేశారు. అంతేకాకుండా దరఖాస్తులను ఆన్‌లైన్ చేసుకున్నారు. అయితే ప్రస్తుతం లబ్ధిదారులను గ్రామసభల్లో ఎంపిక చేస్తుండటంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాగా, ఈనెల 26న కొత్త రేషన్ కార్డుల పంపిణీ ప్రారంభించి.. అర్హులందరికీ అందే వరకూ కొనసాగిస్తామని ఇప్పటికే మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి(Minister Uttam Kumar Reddy) స్పష్టం చేశారు.