- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కుక్కను తప్పించబోయి యువకుడి దుర్మరణం
దిశ, రాజంపేట : దైవ దర్శనానికి వెళ్లి తిరిగి ఇంటికి వస్తుండగా జాతీయ రహదారిపై కుక్క అడ్డురావడంతో తప్పించబోయి రెయిలింగ్కి ఢీకొని వ్యక్తి దుర్మరణం చెందాడు. మెదక్ జిల్లా కౌడిపల్లి జాతీయ రహదారిపై శనివారం ఈ ఘటన చోటు చేసుకుంది. మండలంలోని ఆర్గోoడ గ్రామానికి చెందిన వడ్ల రాజు (32), లింగంపేట మండలం శెట్పల్లి సంగారెడ్డి గ్రామానికి చెందిన సతీష్ లు బావ బామ్మర్థులు. హైదరాబాద్ నుండి వీరు వస్తున్న క్రమంలో కౌడిపల్లి శివారులో కుక్క అడ్డు రావడంతో తప్పించబోయి ఇనుప రెలింగ్ కు ఢీకొన్నారు.
ప్రమాదంలో రాజు, సతీష్ కు తీవ్ర గాయాలు కావడంతో ఏరియా పోలీసులు నర్సాపూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరిలించారు. వైద్యులు పరీక్షించి రాజు మృతి చెందినట్లు ధ్రువీకరించారు. రాజుకు సంవత్సరం క్రితమే వివాహం కాగా ప్రస్తుతం భార్య గర్భవతి, ఒక్కగానొక్క కుమారుడు చనిపోవడంతో కుటుంబంలో విషాద ఛాయలు నెలకొన్నాయి.