- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మెడికో ప్రీతి సూసైడ్ కేసులో కీలక పరిణామం
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో సంచలనం సృష్టించిన డాక్టర్ ప్రీతి సూసైడ్ కేసులో కీలక మరో పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితుడైన సైఫ్‌పై హైకోర్టు ఆదేశాల మేరకు కాకతీయ మెడికల్ కాలేజీ యాజమాన్యం ఏడాది సస్పెన్షన్ విధించింది. తాజాగా.. ఆ సస్పెన్షన్‌ను మరో 97 రోజుల పాటు పొడిగించింది. ఈ మేరకు అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. అయితే, గతడాది ఫిబ్రవరి 22న ఉదయం ప్రీతి ఆత్మహత్యకు యత్నించగా.. ఐదు రోజుల పాటు మృత్యువుతో పోరాడి చివరికి తుదిశ్వాస విడిచింది.
ఈ కేసును పోలీసులు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. సీనియర్లు, తోటి మెడికోలు, ఫ్యాకల్టీతో పాటు మొత్తంగా 70 మంది సాక్షులను పోలీసులు విచారించారు. సైఫ్, ప్రీతి కాల్ డేటా ఆధారంగా సాక్ష్యాధారాలను సేకరించి.. ఏకంగా 970 పేజీలతో ఛార్జ్ షీట్‌ను పోలీసులు న్యాయస్థానంలో దాఖలు చేశారు. చివరకు సైఫ్‌ను కస్టడీలోకి తీసుకుని.. అన్ని కోణాల్లో విచారణ చేయగా.. అసలు విషయాలు బయటపడటంతో అనుమానాలకు పుల్‌స్టాప్ పడి నేరు రుజువైంది.