- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
కేబినెట్ సబ్ కమిటీ తొలి భేటీలో కీలక నిర్ణయం.. 14 వరకు డెడ్‌లైన్
దిశ, తెలంగాణ బ్యూరో: ప్రాజెక్టులు, చెరువుల్లో పూడికతీత పనులు, రిపేర్ వర్క్స, జలాశయాల నిర్వహణ తదితర అంశాలపై కేంద్ర జలశక్తి మంత్రిత్వశాఖ ఆదేశం మేరకు ఏర్పాటైన రాష్ట్ర స్థాయి కేబినెట్ సబ్ కమిటీ తొలి సమావేశంలో కీలక నిర్ణయం జరిగింది. మేజర్ ప్రాజెక్టుల పనితీరులకు ఎలాంటి అవాంతరాలు లేకుండా పూడికతీత పనులు జరగాలని చర్చించి సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. ప్రాజెక్టుల్లో పూడికతీత పనులు చేపట్టడం ద్వారా నీటి నిల్వలు మెరుగుపడతాయని నొక్కిచెప్పింది. ఈ పనులను నిర్వహించడానికి ఇరిగేషన్ శాఖతో పాటు మైన్స్, జియాలజీ విభాగాల అధికారులు కూడా సమన్వయంతో సమగ్ర విధానాన్ని రూపొందించుకోవాలని, ఈ నెల 14వ తేదీకల్లా నివేదిక సమర్పించాలని కేబినెట్ సబ్ కమిటీ ఆదేశించింది. ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నేతృత్వంలో ఏర్పడిన కేబినెట్ సబ్ కమిటీలో మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, జూపల్లి కృష్ణారావు సభ్యులుగా ఉన్నారు.
కేంద్ర జలశక్తి మంత్రిత్వశాఖ ఆదేశం మేరకు హడావిడిగా ఏర్పడిన ఈ సబ్ కమిటీ పస్ట్ మీటింగ్‌ను సచివాలయంలో నిర్వహించి అనేక అంశాలను చర్చించింది. ప్రాజెక్టుల్లో పూడికతీత పనులకు కేంద్ర ప్రభుత్వమే అనుమతి ఇచ్చినందున ప్రత్యేకంగా పర్యావరణ మంత్రిత్వశాఖ నుంచి మళ్ళీ పర్మిషన్స్ రావాల్సిన అవసరం లేదని మంత్రులు నొక్కిచెప్పారు. పూడికతీత సమయంలో ప్రాజెక్టులకు కొన్ని ఇబ్బందులు వస్తాయేమోననే ఆందోళన సహజమని, కానీ వాటికి ఎలాంటి నష్టం వాటిల్లకుండా పకడ్బందీ విధానాన్ని రూపొందించాలని అధికారులకు కేబినెట్ సబ్ కమిటీ స్పష్టం చేసింది. ప్రాజెక్టుల భద్రత విషయంలో ఎలాంటి రాజీ ఉండొద్దని నొక్కిచెప్పింది. పూడికతీత ద్వారా వచ్చే మట్టి సారవంతంగా ఉంటుందని, దానిని రైతులకు ఉచితంగానే ఇవ్వాలని స్పష్టం చేసింది. కానీ రైతులు వారి పొలాల వరకు తీసుకెళ్ళడానికి అవసరమ్యే రవాణా ఖర్చును వారే భరించాలన్నది.
పూడికతీత ద్వారా వచ్చిన మట్టి, ఇసుకను ఎప్పటికప్పుడు క్రమబద్దీకరించాలని, ఇసుకను ఆయా ప్రాజెక్టుల ఇతర నిర్మాణ అవసరాలకు వినియోగించాలని చెప్పింది. పూడికతీత అంశంపై ఈ నెల 14 నాటికి సమగ్రమైన నివేదిక ఇవ్వాలని, ఇందుకోసం ఇరిగేషన్, మైనింగ్, జియాలజీ శాఖలు పరస్పరం సమావేశమై చర్చించుకోవాలని పేర్కొన్నది. పూడికతీత ద్వారా ప్రాజెక్టుల్లో యథాస్థితిని పునరుద్ధరించినట్లవుతుందని, నీటి నిల్వలు వాస్తవ స్థాయికి చేరుకుంటాయని పేర్కొన్నది. ఇప్పటికే పూడికతీత విధానాన్ని అమలుచేస్తున్న రాష్ట్రాలలో పనుల పురోగతిపై అధ్యయనం అధికారులకు చేయాలని సూచించింది. ఈ సమావేశంలో ఇరిగేషన్ సెక్రెటరీ రాహుల్ బొజ్జా, స్పెషల్ సెక్రెటరీ ప్రశాంత్ జీవన్ పాటిల్, సలహాదారు ఆదిత్యనాధ్ దాస్, మైన్స్-జియాలజీ సెక్రెటరీ సురేంద్ర మోహన్, డైరెక్టర్ సుశీల్ కుమార్, ఈ-ఇన్-సీ అనిల్ కుమార్, డిప్యూటీ ఈ-ఇన్-సీ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.