- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
దళిత బంధుతో కాంగ్రెస్ కార్యకర్తలకు గాలం
దిశ, తెలంగాణ బ్యూరో: దళిత బంధుతో కుట్ర జరుగుతుందని టీపీసీసీ దళిత్ కాంగ్రెస్చైర్మన్ ప్రీతమ్ పేర్కొన్నారు. దళిత బంధు పేరిట కాంగ్రెస్ కార్యకర్తలను బీఆర్ఎస్లోకి గుంజే ప్రయత్నం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ..దళిత బంధు అవినీతి పథకమని కాంగ్రెస్ గతంలోనే చెప్పినట్లు గుర్తు చేశారు. ఇప్పుడు అవినీతి జరిగిందని స్వయంగా కేసీఆర్ ఒప్పుకున్నాడన్నారు. జనగామ ఎమ్మెల్యే దళిత బంధు పథకాన్ని టీఆర్ఎస్ ఓటు వేసే వాళ్లకే ఇస్తామని బహిరంగంగా చెప్పారన్నారు.
ఇంత ఘోరంగా అవినీతి జరుగుతుంటే బీజేపీ కేంద్రంలో ఏమి చేస్తుందని ప్రశ్నించారు. కేసీఆర్ కుటుంబం అవినీతికి పాల్పడుతుందని అమిత్ షా పలు మార్లు చెబుతున్నదని, కానీ వాళ్లను ఎందుకు జైల్లో వేయడం లేదని ప్రశ్నించారు. టీపీసీసీ వైస్‌ప్రెసిడెంట్ మల్లు రవి మాట్లాడుతూ...కొత్త సెక్రటేరియట్ కంటే పాత సచివాలయమే బాగున్నదని విమర్శించారు. ఛాంబర్లు పెద్దగా ఉంటే ప్రజలకు ఉపయోగం ఏమీ లేదన్నారు. మంచి స్కీమ్‌లకు పునాది పడితే మేలు జరుగుతుందన్నారు.