మహేష్ కోఆపరేటివ్ బ్యాంకులో రూ.300 కోట్ల భారీ కుంభకోణం

by Bhoopathi Nagaiah |
మహేష్ కోఆపరేటివ్ బ్యాంకులో రూ.300 కోట్ల భారీ కుంభకోణం
X

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్‌లోని మహేశ్ కోఆపరేటివ్ బ్యాంకులో రూ.300 కోట్ల కుంభకోణం వెలుగులోకి వచ్చింది. ఈడీ దర్యాప్తు చేస్తోన్న ఈ కేసులో విస్తుపోయే నిజాలు బయటికి వస్తున్నాయి. కోట్ల కొద్దీ బ్యాంకు నిధులు పక్కదారి పట్టినట్టు తెలుస్తోంది. రెండు రోజులపాటు బ్యాంక్ ప్రమోటర్ల, వారి సన్నిహితుల ఇళ్ళల్లో ఏకకాలంలో జరిపిన దాడుల్లో కోటి రూపాయల నగదు, 5 కోట్ల రూపాయల విలువైన బంగారు నగలతోపాటు అనేక పత్రాలను ఈడీ స్వాధీనం చేసుకుంది. దాదాపు 1800 మందికి నకిలీ బంగారంపై రూ. 300 కోట్ల రుణాలు ఇచ్చినట్టు ఈడీ తేల్చింది. వీరందరూ తప్పుడు ధ్రువీకరణ పత్రాలు సమర్పించినట్టు తెలుస్తోంది. మరో రూ.18.50 కోట్ల నిధులకు సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉందని, దీనిపై ఇంకా విచారణ కొనసాగుతోందని పేర్కొంది. ఇప్పటికే బ్యాంక్ చైర్మన్ రమేష్ కుమార్ బంగ్, వైస్ చైర్మన్ పురుషోత్తమదాస్, మేనేజింగ్ డైరెక్టర్ ఉమేష్ చంద్‌ను ఈడీ అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం. కాగా ముందు నుండి ఈ బ్యాంక్ కార్యకలాపాలపై అనేక అవకతవకలను ఆర్బీఐ హెచ్చరిస్తూనే ఉంది. బ్యాంక్ సైబర్ సెక్యూరిటీపై పలుమార్లు సైబర్ దాడులు జరిగినప్పటికీ తగిన చర్యలు తీసుకోలేదని సైబర్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed