- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఉండలేక కొందరు.. వెళ్లలేక మరికొందరు.. ఫస్ట్ వీక్‌లో స్టేట్ బీజేపీలో భారీ కుదుపు?
దిశ, తెలంగాణ బ్యూరో: ఎంకి పెళ్లి సుబ్బి చావుకు వచ్చినట్లు.. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అరెస్టు, కేసీఆర్‌కు వ్యతిరేకంగా చేసే పోరాటం బీజేపీ అస్థిత్వానికి సంకటంగా మారింది. ఆమెను అరెస్టు చేస్తే తప్ప రాష్ట్రంలో బీజేపీ బలపడే అవకాశం లేదనే అభిప్రాయాన్ని ఆ పార్టీ నేతలు చాలా మంది బహిరంగంగానే వ్యాఖ్యానించారు. ఢిల్లీలోని పార్టీ నేతలకూ ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. రాష్ట్రంలో కేసీఆర్ పాలనకు వ్యతిరేకంగా కొట్లాడుతుందనే నమ్మకంతోనే తాము బీజేపీలో చేరామని కూడా క్లారిటీ ఇచ్చారు. ఆ లక్ష్యంతోనే పలువురు సీనియర్ నేతలు బీఆర్ఎస్‌ను, కాంగ్రెస్ పార్టీని వీడి అందులో చేరారు. కేసీఆర్‌ను ఓడించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. కానీ వారి అంచనాలన్నీ తలకిందులయ్యాయి.
కేసీఆర్‌తో బీజేపీ కొట్లాడడంలేదని, ఫ్రెండ్లీ రిలేషన్స్ కొనసాగిస్తున్నదనే బలమైన అనుమానంతో ఇటీవల పలువురు రహస్యంగా సమావేశమయ్యారు. అదే సమయంలో కల్వకుంట్ల కవిత అరెస్టు ఖాయమనే నమ్మకంతో ఇప్పటివరకూ కొనసాగారు. కేసీఆర్ ఫ్యామిలీ అవినీతిని స్వయంగా ప్రధాని మోడీ, అమిత్ షా, జేపీ నడ్డా, సునీల్ బన్సల్, తరుణ్‌చుగ్ లాంటి కేంద్ర నేతలంతా ప్రస్తావించడంతో కొట్లాడుతుందని, చర్యలుంటాయని రాష్ట్రానికి చెందిన నేతలు ధీమాతో ఉన్నారు. కానీ కర్ణాటక ఎన్నికల ఫలితాల తర్వాత పరిణామాలు వేరుగా ఉండడంతో అసంతృప్తి మొదలైంది. బండి సంజయ్‌ను రాష్ట్ర అధ్యక్ష బాధ్యతల నుంచి తొలగించడంతో ఆ పార్టీలో లుకలుకలు మొదలయ్యాయి. ఇప్పుడు తారస్థాయికి చేరడంతో ఎవరు ఉంటారో.. ఎవరు విడిచి వెళ్తారోననేది ఆ పార్టీలో హాట్ టాపిక్‌గా మారింది.
మాజీ ఎంపీలు కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, వివేక్, విజయశాంతి, రవీంద్రనాయక్, మాజీ మంత్రి విజయ రామారావు, మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి.. ఇలా అనేక మంది బీజేపీలోని తాజా పరిస్థితిపై భిన్నాభిప్రాయాలతో ఉన్నారు. ఇందులో కొంత మంది ఒక్కచోట చేరి భవిష్యత్ కార్యాచరణపై చర్చించుకున్నారు. దాదాపు వీరంతా బీజేపీని వీడి వెళ్లాలనే ఏకాభిప్రాయానికి వచ్చినట్లు వార్తలు వెలువడ్డాయి. ఎక్కువ మంది కాంగ్రెస్‌లోకి వెళ్లాలనుకుంటుండగా మరికొద్దిమందికి మాత్రం అక్కడకు వెళ్లినా టికెట్ గ్యారంటీ లేదనే అనిప్రాయంతో ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో పడ్డారు. ఇటు బీజేపీలో కొనసాగలేక.. అటు మరో పార్టీలోకి వెళ్లలేక రానున్న రోజుల్లో ఎలాంటి నిర్ణయాన్ని తీసుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది.
కర్ణాటక ఎన్నికల వరకూ రాష్ట్రంలో బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ అనే స్థితిలో ఉన్న రాజకీయ పరిణామాలు ఆ తర్వాతి నుంచి మారాయి. క్రమంగా బీజేపీ సెకండ్ ప్లేస్ నుంచి పడిపోయింది. ఈసారి ఎన్నికల్లో కనీసం డబుల్ డిజిట్‌నైనా టచ్ చేస్తుందా అనే అనుమానాలు బలంగా నెలకొన్నాయి. మంత్రి కేటీఆర్ మూడు నెలల క్రితం ఢిల్లీ వెళ్లి కేంద్ర మంత్రులు, బీజేపీ సీనియర్ నేతలతో భేటీ అయిన తర్వాత నుంచి ఈ అనుమానాలు మరింత బలపడ్డాయి. దానికి తోడు కవిత అరెస్టు విషయంలో వీరు ఆశించిన తీరులో రిజల్టు రాకపోవడంతో మరింత అసంతృప్తికి లోనయ్యారు. సుప్రీంకోర్టులో మంగళవారం జరిగిన విచారణతో కవిత అరెస్టు నవంబరు 20వ తేదీ వరకు సాధ్యం కాదని తేలడంతో వీరు బీజేపీలో చేరిన లక్ష్యం నెరవేరలేదనే అభిప్రాయం బలంగా వినిపిస్తున్నది.
ప్రధాని మోడీ అక్టోబరు 1న మహబూబ్‌నగర్ పర్యటన అనంతరం రాష్ట్ర బీజేపీలో ఊహించని పరిణామాలు ఉంటాయన్నది ఆ పార్టీ నేతలు సూచనప్రాయంగా తెలిపారు. కొద్దిమంది కాంగ్రెస్ గూటికి చేరడానికి రంగం సిద్ధం చేసుకోగా మరికొందరు ఇందుకు భిన్నమైన నిర్ణయాన్ని తీసుకోనున్నట్లు సమాచారం. కాంగ్రెస్‌లో చేరినా టికెట్‌పైన స్పష్టత లేకపోవడంతో ఆ పార్టీలో చేరినా ఉపయోగం లేదనే భావనతో ఇకపైన ఎలాంటి నిర్ణయాన్ని తీసుకుంటారన్నది మరికొందరి విషయంలో వస్తున్న వాదన. కర్ణాటక ఫలితాలకు ముందున్న రాజకీయ పరిస్థితుల్లో బీజేపీలో చేరినా ఇప్పుడు ఇమడలేని పరిస్థితుల్లో రెంటికి చెడ్డ రేవడిగా తయారైంది. బీజేపీలో చేరిన లక్ష్యం నెరవేరదని స్పష్టం కావడంతో పార్టీ మారడమే ఉత్తమమనే నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది.
కాంగ్రెస్‌లోకి టికెట్ గ్యారంటీ అని భావించేవారి విషయంలో పెద్దగా కన్‌ఫ్యూజన్ లేకపోయినప్పటికీ అలాంటి క్లారిటీ లేనివారు మాత్రమే ఇప్పుడు కన్‌ఫ్యూజన్‌లో ఉన్నారు. బీజేపీలో కొనసాగి ఉపయోగం లేదనే స్పష్టతతో ఉన్నప్పటికీ ఆల్టర్నేట్‌గా అవకాశాలు లేవనేది వారి ఆవేదన. ఏం చేయాలో తెలియక దిక్కతోచని స్థితిలో పడ్డారు. ఎలక్షన్ నోటిఫికేషన్ విడుదలై నామినేషన్ల పర్వం ముగిసేలోపే నిర్ణయం తీసుకోవాలని, లేదంటే ఆ తర్వాత చేరినా ప్రయోజనం ఉండదనే ముందుచూపుతో రానున్న వారం, పది రోజుల్లో కొద్దిమంది స్పష్టమైన నిర్ణయాన్ని తీసుకోనున్నట్లు బీజేపీ వర్గాల్లోనే చర్చ జరుగుతున్నది. ప్రధాని టూర్ ముగిసిన తర్వాత వరుసగా పార్టీని వీడేవారు పదుల సంఖ్యలోనే ఉంటారన్నది పార్టీ స్టేట్ ఆఫీస్ వర్గాల్లో వినిపిస్తున్న మాట.