- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Fire Accident: హైదరాబాద్‌లో భారీ అగ్ని ప్రమాదం.. ముగ్గురు మృతి

దిశ, వెబ్ డెస్క్: హైదరాబాద్‌లోని నార్సింగి పోలీసు స్టేషన్ పరిధిలోని పుప్పాగూడలో శుక్రవారం సాయంత్ర భారీ అగ్ని ప్రమాదం (Fire Accident) చోటుచేసుకుంది. పాషా కాలనీలో ఉన్న రెండు అంతస్థుల భవనంలోని గ్రౌండ్ ఫ్లోర్‌లో గ్యాస్ సిలిండర్ పేలి ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలి చేరుకుని మంటలను అదుపు చేశారు. అయితే, మొదటి అంతస్తులోని ఓ గదిలో చిక్కుకున్న ఇద్దరు మహిళలు, ఒక చిన్నారిని స్ట్రెచర్‌పై బయటకు తీసుకొచ్చారు. అపస్మారక స్థితిలో ఉన్నవారిని ఆస్పత్రికి తరలించారు. అయితే, వారి ఆరోగ్య పరిస్థితి విషమించి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందినట్లు తెలుస్తోంది. మృతులను సిజిరా(7), సహానా(40), జమీలా(70)గా గుర్తించారు. ప్రమాదం నుంచి మరో ఐదుగురిని కాపాడారు. కాగా, భవనంలో మూడు గ్యాస్ సిలిండర్ల పేలుడుతో ప్రమాద తీవ్రత పెరిగింది.
గ్యాస్ వాడేటప్పుడు ఈ జాగ్రత్తలు తప్పనిసరి
* గ్యాస్ సిలిండర్ వాడేటప్పుడు తప్పనిసరిగా జాగ్రత్తలు పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు.
* గ్యాస్ సిలిండర్‌ను ఎప్పుడూ నిలువుగానే ఉంచాలి.
* ఎట్టిపరిస్థితుల్లోనూ అడ్డంగా పడుకోబెట్టకూడదు. స్టవ్‌ను సిలిండర్ కంటే ఎత్తులో ఉంచి వంట చేయాలి.
* గ్యాస్‌ను ఆన్ చేయడం, అగ్గి పుల్ల గీయడం లేదా లైటర్ అంటిచడం ఒకేసారి చేయాలి. ఆన్ చేశాక అగ్గి పుల్లని గీయకూడదు.
* గ్యాస్ పైపులకు ఎలాంటి జాయింట్లు ఉండకూడదు.
* సిలిండర్ వినియోగించకపోతే గ్యాస్ ఉన్నా లేకున్నా.. మూత బిగించే ఉంచాలి. వినియోగిస్తున్నట్లైతే పని పూర్తవ్వగానే రెగ్యులేటర్ ఆఫ్ చేయాలి.
* ముఖ్యంగా బయటకు వెళ్తున్నప్పుడు, రాత్రి పడుకునే ముందు గ్యాస్ ఆఫ్ చేశామో లేదో ఓసారి చెక్ చేసుకుంటే మంచిది.
* గ్యాస్ ట్యూబ్లు కంపెనీవి మాత్రమే వినియోగించాలి. వీటిని 4-5 ఏళ్లకు ఒకసారి తప్పనిసరిగా మార్చాలి.
* సిలిండర్‌ను సరిగా అమర్చటం రాకుంటే సర్వీస్ మ్యాన్ లేదా డెలివరీ పర్సన్ సహాయం తీసుకోవాలి.
* సిలిండర్‌ను గాలి, వెలుతురు బాగా తగిలే ప్రదేశంలోనే పెట్టాలి. ఒకవేళ కిచెన్ కబోర్డ్‌లో ఉంచితే డోర్ దిగువ, పై భాగాల్లో వెంటిలేషన్ ఉండేలా చూసుకోవాలి.
* పిల్లలను ఎప్పుడూ వంటగదికి, ఎల్పీజీ సిలిండర్‌కు దూరంగా ఉండేలా చూసుకోవాలి.