షాపింగ్ మాల్‌లో భారీ అగ్నిప్రమాదం.. మంటలు అదుపులోకి రాకపోవడంతో హై టెన్షన్!

by Rajesh |   ( Updated:2023-12-14 03:10:56.0  )
షాపింగ్ మాల్‌లో భారీ అగ్నిప్రమాదం.. మంటలు అదుపులోకి రాకపోవడంతో హై టెన్షన్!
X

దిశ, వెబ్‌డెస్క్: కామారెడ్డిలోని అయ్యప్ప షాపింగ్ మాల్ లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. బుధవారం అర్ధరాత్రి ఒక్క సారిగా షాపింగ్ మాల్ లో మంటలు చెలరేగాయి. క్రమంగా షాపింగ్ మాల్ నాలుగు అంతస్తులకు మంటలు వ్యాపించాయి. మంటల్లో షాపింగ్ మాల్‌లోని సామాగ్రి మొత్తం కాలి బూడిదైంది. వెంటనే సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. 7 గంటలు అయినా మంటలు అదుపులోకి రాలేదు. దీంతో పక్క బిల్డింగ్ వారిని సురక్షిత ప్రదేశానికి తరలిస్తున్నారు. మంటలు అదుపులోకి రాకపోవడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ప్రమాదం ఎలా జరిగిందనే అంశంపై అధికారులు ఫోకస్ పెట్టారు.

Advertisement

Next Story