- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సర్కారు శాఖల మధ్య పెరుగుతున్న గ్యాప్
దిశ, సిటీబ్యూరో : మహానగరంలోని ప్రజల జీవితాలను ప్రభావితం చేసే శాఖలతో జీహెచ్ఎంసీకి రోజురోజుకు దూరం పెరుగుతుంది. జీహెచ్ఎంసీలో అంతర్గతంగాను, ఇతర ప్రభుత్వ శాఖలతో సమన్వయ లోపం తలెత్తింది. గతంలో సిటీ సమన్వయ కమిటీ తరుచూ సమావేశాలు నిర్వహిస్తూ, అభివృద్ధి పనులు సకాలంలో పూర్తయ్యేలా చర్యలు చేపట్టేది. దీనిలో వివిధ ప్రభుత్వ విభాగాలకు చెందిన అన్నిశాఖల అధికారులు సభ్యులుగా ఉండగా, జీహెచ్ఎంసీ పెద్దన్న పాత్రను పోషించేది. ఈ సిటీ సమన్వయ కమిటీతో నగరంలో ప్రస్తుతం విస్తరించి కన్పిస్తున్న రోడ్ల వెడల్పులో భాగంగా స్థల సేకరణకు సంబంధించి అనేక సమస్యలు పరిష్కారమయ్యాయి. ఆ తర్వాత స్వపరిపాలన తర్వాత దీర్ఘకాలిక ప్రజామస్యల పరిష్కారం, అభివృద్ధిలో ఇతర శాఖలను భాగస్వామ్యం చేసేందుకు ప్రతి నెలలో రెండుసార్లు కన్వర్జెన్సీ సమావేశాలు నిర్వహించేవారు.
పక్షం రోజులకోసారి జరిగే ఈ సమావేశంలో అత్యవసర సేవలందించే జీహెచ్ఎంసీ, జలమండలి, హెచ్ఎండీఏ, ఆర్టీసీ, మెట్రో రైలు, వైద్యారోగ్యశాఖ, కలెక్టరేట్, పోలీస్ తదితర విభాగాలకు చెందిన ఉన్నతాధికారులు హాజరై సమస్యలపై, అభివృద్ధి పనుల్లో ఏర్పడే సమన్వయ లోపాల్ని సరిదిద్దేవారు. ఈ కన్వర్జెన్సీ సమావేశాల్లో పలు దీర్ఘకాలిక సమస్యలెన్నో పరిష్కారమయ్యాయి. కానీ నాలుగేళ్ల నుంచి కనీసం కన్వర్జెన్సీ సమావేశాలు కూడా నిర్వహించకపోవటంతో జీహెచ్ఎంసీలోని అంతర్గత విభాగాలతో పాటు ఇతర ప్రభుత్వ శాఖలతో జీహెచ్ఎంసీ సమన్వయం లేకుండా పోయింది. సమైక్యాంధ్ర పాలనలో సమన్వయ కమిటీ, స్వపరిపాలనలో కన్వర్జెన్సీ సమావేశాలు మంచి ఫలితాలనిచ్చాయి. కానీ 2018 తర్వాత కన్వర్జెన్సీ సమావేశాలను నిర్వహించకపోవటంతో ఇతర ప్రభుత్వ శాఖలతో జీహెచ్ఎంసీకి సమన్వయం కుదరటం లేదు.
వివిధ అంశాలకు సంబంధించి సంబంధిత విభాగాధిపతి నేరుగా వెళ్లి, ఇతర ప్రభుత్వశాఖల విభాగాధిపతులతో పలు దఫాలుగా చర్చించాల్సి రావటంతో సమయం వృథా అయి పనుల్లో తీవ్ర జాప్యం జరుగుతుంది. సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన వెంటనే ప్రజావాణి నిర్వహించనున్నట్లు సంచలన ప్రకటన చేసిన సీఎం రేవంత్ మున్సిపల్ శాఖను ఇతర మంత్రులకు కేటాయించకుండా తన వద్దనే పెట్టుకోవటంతో, జీహెచ్ఎంసీ పరిధిలోని వివిధ ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయాన్ని పెంపొందించేందుకు కన్వర్జెన్సీ మీటింగ్‌ల నిర్వహణకు ఆదేశాలివ్వాలన్న డిమాండ్లు వినిపిస్తున్నాయి.
సమన్వయం అంతంతమాత్రమే..
జీహెచ్ఎంసీ పరిధిలోని ఇళ్లు, వ్యాపార సంస్థలపై అడ్వర్‌టైజ్ మెంట్లను ఏర్పాటు చేసుకోవాలంటే అనుమతి ఎవరివ్వాలన్న అంశంపై జీహెచ్ఎంసీలోనే అంతర్భాగంగా ఉన్న ఎన్‌ఫోర్స్‌మెంట్, విజిలెన్స్ అండ్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ (ఈవీడీఎం)కు జీహెచ్ఎంసీకి ఏమాత్రం సమన్వయం కుదరటం లేదు, కమిషనర్ జారీ చేస్తారని ఈవీడీఎం డైరెక్టర్ చెబుతుండగా, ఈవీడీఎం డైరెక్టరే అనుమతులిస్తారని కమిషనర్ వ్యాఖ్యానించటం వారిద్దరి మధ్య ఏర్పడిన గ్యాప్‌కు నిదర్శనం. ఈ రెండు విభాగాల మధ్య తలెత్తిన సమన్వయ లోపం స్టాండింగ్ కమిటీలో ఈవీడీఎంను రద్దు చేయాలంటూ చర్చ జరిగేందుకు కారణమైంది. దీంతో పాటు రోడ్డు విస్తరణకు సంబంధించి ఇంజినీరింగ్, టౌన్ ప్లానింగ్ విభాగాల మధ్య ఇలాంటి గ్యాపే పెరిగినట్లు తెలిసింది.