Oneplus: వన్‌ప్లస్ కీలక నిర్ణయం.. ఆ ఫోన్ పై భారీ డిస్కౌంట్..!

by Maddikunta Saikiran |
Oneplus: వన్‌ప్లస్ కీలక నిర్ణయం.. ఆ ఫోన్ పై భారీ డిస్కౌంట్..!
X

దిశ, వెబ్‌డెస్క్: చైనా(China)కు చెందిన ప్రముఖ టెక్ దిగ్గజ సంస్థ వన్‌ప్లస్(Oneplus) కీలక నిర్ణయం తీసుకుంది. త్వరలో భారత మార్కెట్లో ఫ్లాగ్‌షిప్ వన్‌ప్లస్ 13 సిరీస్(OnePlus 13 series) లాంచ్ కానున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వన్‌ప్లస్ 12 మొబైల్ ధరను భారీగా తగ్గించింది. లాంచ్ సమయంలో 12జీబీ+ 128 జీబీ వేరియంట్ ధర రూ. 64,999 నిర్ణయించగా.. ప్రస్తుతం ఈ-కామర్స్ ఫ్లాట్ ఫామ్ అమెజాన్(Amazon) లో రూ. 59,999కే లభిస్తోంది. అలాగే ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్, వన్ కార్డుతో ఈ మొబైల్ ను కొనుగోలు చేస్తే ఏకంగా రూ. 7 వేల డిస్కౌంట్ అందిస్తోంది. ఇక ఈఎంఐ(EMI) ఆప్షన్ ఎంచుకున్న వారికి కూడా ఆఫర్ కల్పిస్తోంది. ప్రస్తుతం అమెజాన్ లో 3 నుంచి 9 నెలల వరకు ఈఎంఐ చూజ్ చేసుకునే అవకాశం ఉంది. డిస్కౌంట్, కార్డు ఆఫర్లు, ఈఎంఐ ఆప్షన్ ఇలా అన్ని డిస్కౌంట్లు కలుపుకుంటే వన్‌ప్లస్ 12 మొబైల్ ను రూ. 52,999కే కస్టమర్లు సొంతం చేసుకోవచ్చు.

వన్‌ప్లస్ 12 స్పెసిఫికేషన్స్ ఇవే..

  • 6.8 ఇంచెస్ క్వాడ్ HD+LTOP 4.0 అమోలోడ్ డిస్ ప్లే ఇచ్చారు.
  • క్వాల్ కామ్ స్నాప్‌డ్రాగన్ 8జెన్ 3 ప్రాసెసర్ తో రన్ అవుతుంది.
  • ఆండ్రాయిడ్ 14 ఆధారిత ఆక్సిజన్ ఓఎస్ తో పని చేస్తుంది.
  • 120Hz రిఫ్రెష్ రేట్, 4500 పీక్ బ్రైట్ నెస్
  • ఇక కెమెరా విషయానికొస్తే.. బ్యాక్ సైడ్ 50 ఎంపీ, 48 ఎంపీ అల్ట్రావైడ్ యాంగిల్, 64 ఎంపీ పెరిస్కోప్ టెలిఫోటో కెమెరా ఇచ్చారు.
  • సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 32 ఎంపీ ఫ్రంట్ కెమెరా ఉంది.
  • 50w ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 5,400mah బ్యాటరీ కలిగి ఉంది.
Advertisement

Next Story

Most Viewed