'అది స్కామ్ అని ఏ ఫూల్ అంటాడు'.. బీజేపీపై కేసీఆర్ ఫైర్

by Prasad Jukanti |
అది స్కామ్ అని ఏ ఫూల్ అంటాడు.. బీజేపీపై కేసీఆర్ ఫైర్
X

దిశ, డైనమిక్ బ్యూరో:ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో నరేంద్ర మోడీ క్రూరమైన ఆట ఆడుతున్నారని ఇందులో ఎటువంటి స్కామ్ లేదని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. ఈ కేసులో కవిత, అరవింద్ కేజ్రీవాల్ అమాయకులు అని, ఇది కేవలం పొలిటికల్ గేమ్ అని కొట్టిపారేశారు. రాష్ట్రం రూపొందించుకున్న లిక్కర్ పాలసీని స్కామ్ అని ఏ ఫూల్ అంటారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఇండియా టుడేతో మాట్లాడిన ఆయన.. ఈ దేశంలోని ప్రతి రాష్ట్రానికి ప్రత్యేకమైన లిక్కర్ పాలసీలు ఉన్నాయని గుర్తు చేశారు. ఈ కేసులో నయా పైసా రికవరీ చేయలేదని ధ్వజమెత్తారు. ఈడీ, సీబీఐలు బీజేపీకి అనుబంధ సంస్థలుగా పని చేస్తున్నాయని ఆరోపించారు. తమకు కోర్టులపై నమ్మకం ఉందని కచ్చితంగా తమకు న్యాయం జరుగుతుందని ధీమా వ్యక్తం చేశారు.

బీజేపీతో బీఆర్ఎస్ సీక్రెట్ గా ఒప్పందం కుదుర్చుకున్నాయని, ప్రతి సందర్భంలో బీజేపీకి బీఆర్ఎస్ మద్దతుగా నిలిచిందని ప్రత్యర్థులు చేస్తున్న ప్రచారంపై స్పందించారు. బీజేపీకి బీఆర్ఎస్ పూర్తి స్థాయిలో ఎప్పుడూ అండగా లేదన్నారు. తెలంగాణ ఏర్పడిన తొలినాళ్ళలో కేంద్రంతో రాజ్యాంగపరమైన సత్సంబంధాలు కొనసాగించామన్నారు. రాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీ కోరితేనే తాము మద్దతు ఇచ్చామని అదే సమయంలో రైతు చట్టాలను బీఆర్ఎస్ తీవ్రంగా వ్యతిరేకించిందని చెప్పారు. తన మట్టుకు ఇండియా, ఎన్డీయే ఈ రెండు కూటములు వట్టివే అని ఈ లోక్ సభ ఎన్నిక్లలో ప్రాంతీయ పార్టీలే బలమైన పక్షంగా నిలబోతున్నాయని విశ్వాసం వ్యక్తం చేశారు.

Advertisement

Next Story

Most Viewed