వరుస చైన్ స్నాచింగ్‌ల కలకలం

by Sathputhe Rajesh |   ( Updated:2023-03-15 03:19:47.0  )
వరుస చైన్ స్నాచింగ్‌ల కలకలం
X

దిశ, ఆర్మూర్ : ఆర్మూర్ మున్సిపల్ పరిధిలో చైన్ స్నాచింగ్ కలకలం రేపింది. మామిడిపల్లిలో గల యోగేశ్వర్ కాలనీలో వెంకటలక్ష్మి అనే మహిళ నుంచి గుర్తు తెలియని దుండగులు మంగళవారం రాత్రి చైన్స్ స్నాచింగ్‌కు పాల్పడ్డారు. యోగేశ్వర కాలనీకి చెందిన వెంకటలక్ష్మి ఆర్మూర్‌లోని పాత బస్టాండ్‌లో గల కిరాణా షాప్‌నకు వెళ్లి ఇంటికి సరిపడా సరుకులు తీసుకుంది. అనంతరం ఇంటికి వెళుతుండగా వెనక నుంచి స్కూటీపై వచ్చిన దుండగులు ఆమె మెడలోని మూడున్నర తులాల బంగారు గురించి ఎత్తుకెళ్లినట్లు బాధితురాలు వాపోయింది.

బాధితురాలు ఈ మేరకు ఆర్మూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. ఇదే తరహాలో గత నెలలో మామిడిపల్లిలోని వెంకటేశ్వర కాలనీలో వస్త్ర దుకాణ నిర్వాకురాలి నుంచి చైన్ స్నాచింగ్‌కు గురైన విషయం తెలిసింది. మామిడిపల్లి శివారులోని యోగేశ్వర్ కాలనీ వెంకటేశ్వర కాలనీ దారి వెంబడి వెళుతున్న మహిళలను టార్గెట్ చేస్తూ గుర్తు తెలియని వ్యక్తులు చైన్స్ స్నాచింగ్‌లకు పాల్పడుతున్నారు.

ఇదే ఏరియాలో తరచూ చైన్ స్నాచింగ్‌లకు పాల్పడుతున్న సదరు పోకిరిలపై నిఘా పెట్టి ఆర్మూర్ పోలీసులు పట్టుకొవాలని మహిళలు కోరుతున్నారు. మహిళలకు రక్షణ ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉందని వారంటున్నారు. ఆర్మూర్ పోలీసులు ఈ చైన్స్ స్నాచింగ్ అంశాన్ని సీరియస్‌గా తీసుకుని ప్రజల్లో భరోసా కల్పించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

Advertisement

Next Story