- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
ప్రతిపక్షాలకు గుణపాఠం తప్పదు: Guvvala Balaraju
దిశ, వంగూర్: ప్రతిపక్షాలకు గుణపాఠం తప్పదని, సంక్షేమ పథకాల అమలులో దేశంలోనే తెలంగాణ రాష్ట్రం ముందుందని ప్రభుత్వ విప్, అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు అన్నారు. అచ్చంపేట నియోజకవర్గంలో ఎమ్మెల్యే గువ్వల బాలరాజు చేస్తున్న అభివృద్ధిని చూసి వంగూర్ మండలంలోని పోల్కంపల్లి గ్రామానికి చెందిన 50 మంది కాంగ్రెస్ పార్టీ మైనారిటీ నాయకులు కేటీఆర్ సేవా జిల్లా అధ్యక్షుడు అంకు సురేందర్,టిఆర్ఎస్ పార్టీ మండల సీనియర్ నాయకుడు సాయన్న,గ్రామ అధ్యక్షుడు రేణుగౌడ్ల ఆధ్వర్యంలో మంగళవారం టీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రజా విశ్వాసం కోల్పోయిన విపక్షాలకు మనుగడ కష్టమన్నారు.
గ్రామాల అభివృద్ధి, పేదరిక నిర్మూలన రైతు సంక్షేమ అభివృద్ధి దేశంలో మరే రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణ ప్రభుత్వం పథకాలు రూపొందించి అమలు చేస్తుందని తెలిపారు. కేసీఆర్ పాలనా దక్షత, అభివృద్ధి చూసి పార్టీలో చేరికలు కొనసాగుతున్నాయన్నారు. టీఆర్ఎస్ పార్టీపై ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలకు తగిన గుణపాఠం చెబుతామన్నారు. పార్టీలో చేరిన వారిలో సయ్యద్ నిజాముద్దీన్, జహంగీర్, బషీర్, సర్దార్, ఖుస్రు, అష్రఫ్, ఆరిఫ్, షరీఫ్ లతో పాటు 50మంది కాంగ్రెస్ పార్టీ మైనారిటీ నాయకులు ఉన్నారు. మంగళవారం అచ్చంపేట పట్టణంలోని క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే గువ్వల బాలరాజు సమక్షంలో టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు.