తస్మాత్ జాగ్రత్త.. ఈరోజు దొరికితే.. రూ.10,000 ఫైన్, 6 నెలలు జైలు శిక్ష

by Mahesh |
తస్మాత్ జాగ్రత్త.. ఈరోజు దొరికితే.. రూ.10,000 ఫైన్, 6 నెలలు జైలు శిక్ష
X

దిశ, వెబ్ డెస్క్: న్యూ ఇయర్ వేడుకల వేళ ఆకతాయులు, మద్యం ప్రియుల ఆటలు అరికట్టేందుకు పోలీసులు(police) కఠిన చర్యలు తీసుకునేందుకు సిద్ధం అయ్యారు. ఈ క్రమంలోనే ముందస్తుగా న్యూ ఇయర్ వేడుకల(New Year celebrations) వేళ తీసుకునే చర్యలపై అలర్ట్ జారీ చేశారు. గతంలో జరిగిన ఘటనలను దృష్టిలో పెట్టుకొని.. ఈ రోజు రాత్రి 8 నుంచి రేపు ఉదయం 7 గంటల వరకు డ్రంక్ అండ్ డ్రైవ్(Drunk and drive), డ్రగ్ డిటెక్షన్ టెస్టులు(Drug detection tests) చేయనున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ టెస్టులు ఏ ప్రాంతంలో చేస్తారనే విషయాలను పోలీసులు గోప్యంగా ఉంచుతున్నారు. ఈ డ్రంక్ అండ్ డ్రైవ్, డ్రగ్ డిటెక్షన్ టెస్టుల్లో ఎవరైనా మొదటిసారి పట్టుబడితే రూ. 10 జరిగిమాన, 6 నెలల జైలు శిక్ష విధించనున్నారు. అలాగే రెండోసారి పట్టుబడితే ₹15 వేల జరిమానా, జైలు శిక్ష, 3 నెలల పాటు డ్రైవింగ్ లైసెన్స్ సస్పెండ్ చేయనున్నారు. అలాగే ఎవరైన డ్రగ్స్ తీసుకున్నట్లు తేలితే మాత్రం వారిపై నాన్‌బెయిలబుల్ కేసులు(Non-bailable cases) నమోదు చేయనున్నట్లు పోలీసులు తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed