- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బ్రేకింగ్: కేసీఆర్‌పై అనుచిత వ్యాఖ్యలు.. వైఎస్ షర్మిలపై కేసు నమోదు
దిశ, వెబ్‌డెస్క్: వైఎస్సాఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలకు బిగ్ షాక్ తగిలింది. బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో ఆమెపై కేసు నమోదు అయ్యింది. టీఎస్ పీఎస్సీ పేపర్ లీకేజీ వ్యవహారంపై సోషల్ మీడియాలో తెలంగాణ సీఎం కేసీఆర్‌పై, బీఆర్ఎస్ పార్టీపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ పత్రాలు రిలీజ్ చేశారని ఓ బీఆర్ఎస్ కార్యకర్త షర్మిలపై ఫిర్యాదు చేశారు. బీఆర్ఎస్ కార్యకర్త ఫిర్యాదు మేరకు పోలీసులు షర్మిలపై సెక్షన్ 505 (2), 504 కింద కేసు నమోదు చేశారు.
ఇక, టీఎస్ పీఎస్సీ పేపర్ లీకేజీ వ్యవహారంపై రియాక్ట్ అయిన షర్మిల కేసీఆర్‌పై తీవ్ర విమర్శలు చేశారు. ‘‘80 వేల పుస్తకాలు చదివి, ఏకంగా రాజ్యాంగాన్నే తిరగరాద్దామన్న మీకు.. ఒక CM సంతకం పెట్టిన అఫిడవిట్ పవర్ ఏమిటో, అది ఇచ్చే ధైర్యం ఏమిటో కొత్తగా చెప్పక్కర్లేదు అనుకుంటా. ఇక తెలంగాణాలో ఎప్పటికీ పేపర్ లీకులు ఉండవు, ఇది కేసీఆర్ మాట అని అఫిడవిట్ మీద ఒక పెట్టి రాష్ట్రంలోని నిరుద్యోగుల్లో భరోసా నింపాలి’’ అని షర్మిల సవాల్ విసిరారు.