- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Trains: పండుగ వేళ బిగ్ షాక్... ఆ రూట్‌లో నాలుగు రైళ్లు రద్దు

దిశ, వెబ్ డెస్క్: తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సందడి మొదలైంది. విద్యార్థులకు వరుస సెలవులు ప్రకటించారు. దీంతో పట్టణ జనాలంతా పల్లెకు వెళ్తున్నారు. ప్రధానంగా హైదరాబాద్ నుంచి ఏపీకి ప్రజలు సొంతూళ్ల బాట పట్టారు. దీంతో రైల్వే శాఖ ఆదాయంపై దృష్టి పెట్టింది. పలు ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. అయినా ప్రయాణికుల రద్దీ అంతకంతకు పెరుగుతోంది. అటు వందే భారత్ రైళ్లకు కూడా డిమాండ్ పెరిగింది.
అయితే విశాఖ, విజయవాడ రూట్‌లో ప్రయాణికులకు చేదు వార్త వినిపించింది. కీలక రద్దీ సమయంలో నాలుగు రైళ్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. రెండు రోజుల పాటు ముఖ్యమైన సర్వీసులను రద్దు చేస్తున్నట్లు స్పష్టం చేసింది. రైళ్లకు సంబంధించిన వివరాలను వెబ్ సైట్‌లో పెట్టింది. ఈ రోజు నుంచే కాకినాడ పోర్టు-విశాఖపట్నం(17267), విశాఖ పట్నం- కాకినాడ పోర్ట్(17268) రైలును రద్దు చేయగా.. ఆదివారం గుంటూరు-విశాఖ(17239)), విశాఖ-గుంటూరు(17240)ను రద్దు చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. మరోవైపు సికింద్రాబాద్ మధ్య విశాఖ మధ్య నడిచే వందేభారత్ రైలుకు 4 చైర్ కార్ కోచ్‌లను పెంచింది. దీంతో మొత్తం వందేభారత్ రైలులో చైర్ కార్ కోచ్‌ల సంఖ్య 18కు చేరింది.