- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పొంగులేటి వర్గానికి బిగ్ షాక్.. ఆ ముగ్గురు నేతల సెక్యూరిటీ తగ్గింపు
దిశ, వెబ్‌డెస్క్: ఖమ్మం జిల్లాలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి వర్గానికి ప్రభుత్వం షాక్ ఇచ్చింది. ఇప్పటికే మాజీ ఎంపీకి గన్ మెన్లను కుదించిన ప్రభుత్వం తాజాగా మరో ముగ్గురు నేతలకు సెక్యూరిటీ తగ్గించింది. జెడ్పీచైర్మన్ కోరం కనకయ్య గన్ మెన్స్‌ను కుదించింది. 2 ప్లస్ 2 నుంచి 1ప్లస్ 1కు కుదిస్తూ ప్రభుత్తం నిర్ణయం తీసుకుంది. అయితే తనకు గన్ మెన్స్ అవసరం లేదని కనకయ్య వెనక్కి పంపారు.
పినపాక మాజీ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, భద్రాచలం బీఆర్ఎస్ ఇన్ ఛార్జి వెంకట్రావు గన్ మెన్స్ ను ప్రభుత్వం తొలగించింది. దీనిపై స్పందించిన పాయం తనకు కేటాయించిన గన్ మెన్స్ ను తొలగించడం ప్రభుత్వ విజ్ఞతకే వదిలేస్తున్నానన్నారు. సెక్యూరిటీ తీసేసినంత మాత్రాన పోయేది ఏమీ లేదన్నారు. ప్రభుత్వంలో ఇసుక దందాలు, భూకబ్జాలు, గంజాయి మాఫియాకి అండగా ఉన్నవారికి ప్రజలను నిండా ముంచే వారికి దోచుకునే వారికి గన్ మెన్లు కావాలంటూ పాయం వెంకటేశ్వర్లు ఫైర్ అయ్యారు.
వెంకట్రావు స్పందిస్తూ సర్కారు నుంచి ఎలాంటి నిర్ణయం వచ్చినా తన ప్రయాణం పొంగులేటి శ్రీనివాసరెడ్డి తోనే అని క్లారిటీ ఇచ్చారు. సెక్యూరిటీ తొలగింపు ప్రభుత్వ కక్ష సాధింపు చర్య అన్నారు. తనకేమైనా ప్రభుత్వానిదే బాధ్యత అని వెంకట్రావు అన్నారు. ప్రభుత్వం నిర్ణయంతో పొంగులేటి వర్గాన్ని బీఆర్ఎస్ టార్గెట్ చేసిందనే టాక్ ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా నడుస్తోంది.