Khammam floods : ‘ఖమ్మం వరద’ సహాయక చర్యల్లో 525 మంది ట్రైనీ కానిస్టేబుల్స్..

by Ramesh N |   ( Updated:2024-09-03 14:49:38.0  )
Khammam floods : ‘ఖమ్మం వరద’ సహాయక చర్యల్లో 525 మంది ట్రైనీ కానిస్టేబుల్స్..
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణలో కురిసిన భారీ వర్షాలకు ఉమ్మడి ఖమ్మం అతలాకుతలం అయిన విషయం తెలిసిందే. మున్నేరు వాగు పోటెత్తడంతో ఖమ్మం, ఖమ్మం రూరల్ మండలాల్లోని పరీవాహక ప్రాంతం కాలనీల్లోకి నీరు చేరి.. జలదిగ్భంధం అయింది. నీరు మొత్తం తగ్గిన తర్వాత వరద ప్రభావిత కాలనీలు పూర్తిగా బురదమయంగా మారాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాలనీల రోడ్లపై, ఇళ్లలోకి బురద వచ్చి చేరడం, ఇంట్లోని సామాన్లు వరదలో కొట్టుకుపోవడంతో ఇంటిని, సామాన్లను శుభ్రం చేయడానికి ప్రజలు తీవ్ర స్థాయిలో అవస్థలు పడుతున్నారు. ఈ నేపథ్యంలోనే 525 మంది ట్రైనీ కానిస్టేబుల్స్, ఖమ్మం పోలీస్ అధికారులు రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపడుతున్నారు.

ఈ విషయాన్ని ఇవాళ ఎక్స్ వేదికగా తెలంగాణ పోలీసులు తెలిపారు. ‘భారీ వర్షాల తర్వాత వరదలతో మొత్తం బురదమయంగా మారిన ప్రాంతాలను శుభ్రపరుస్తూ, ఖమ్మం వరద బాధిత ప్రజలకు అండగా నిలుస్తున్న 525 మంది ట్రైనీ కానిస్టేబుల్ అధికారులు, ఖమ్మం పోలీసు అధికారులు. వారికి అన్ని రకాలుగా సహాయం చేస్తూ అండగా ఉంటున్నారు’ అని వెల్లడించింది.

Advertisement

Next Story

Most Viewed