- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
రేపు నీట్ ఎగ్జామ్.. హాజరు కానున్న 50 వేల మంది
దిశ, తెలంగాణ బ్యూరో: వైద్య,విద్య ప్రవేశాల కొరకు దేశ వ్యాప్తంగా ఆదివారం నీట్ ఎగ్జామ్ జరగనున్నది.నేషనల్‌టెస్టింగ్ ఏజెన్సీ పరీక్షను నిర్వహించనున్నది. రాష్ట్రంలో హైదరాబాద్, సికింద్రాబాద్, కరీంనగర్, ఖమ్మం, రంగారెడ్డి, వరంగల్,సంగారెడ్డి, మహబూబ్‌నగర్, హయత్‌నగర్, ఆదిలాబాద్, భూపాలపల్లి, గద్వాల, జగిత్యాల, జనగాం, కొత్త గూడెం, మహబూబాబాద్, మంచిర్యాల, మేడ్చల్, నల్గొండ, నిజామాబాద్, సిద్దిపేట, సూర్యాపేట్‌లో లలో పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. మన రాష్ట్రం నుంచి సుమారు 50 వేల మంది ఎగ్జామ్రాసే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5.20 గంటల వరకు పరీక్ష జరగనుంది. 720 మార్కులకు జరిగే ఈ పరీక్షలో ఫిజిక్స్, కెమిస్ట్రీ, బోటనీ, జువాలజీ నుంచి ప్రశ్నలు అడుగుతారు.
ఒక్కొ సరైన సమాధానానికి 4 మార్కులు ఉంటాయి. తప్పుడు సమాధానానికి ఒక మైనస్ మార్కు ఉంటుందని ఎన్‌టీఏ వెల్లడించింది. అయితే ఎగ్జామ్ కేంద్రాల్లోకి జియోమెట్రీ, పెన్సిల్ బాక్స్,ప్లాస్టిక్ పౌచ్, క్యాలిక్యులేటర్, పెన్, స్కేల్,రైటింగ్ ప్యాడ్, పెన్ డ్రైవ్, ఏరేజర్,లాగ్ టేబుల్, ఎలక్ట్రానిక్ పేన్‌స్కానర్‌తో పాటు మొబైల్ ఫోన్, బ్లూటూత్, ఇయర్‌ఫోన్స్, మైక్రోఫోన్, పేజర్, హెల్త్ బ్యాండ్, బెల్ట్స్, హ్యాండ్ బ్యాగ్, గగూల్స్, క్యాప్స్‌తో పాటు వాచ్, బ్రాస్‌లెట్, బంగారు అభరణాలు, ఫుడ్ ఐటెమ్స్, వాటర్ బాటిల్స్‌ను కూడా అనుమతించబోమని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నొక్కి చెప్పింది. కనీసం రెండు గంటల ముందు పరీక్షా కేంద్రానికి చేరుకుంటే ఎలాంటి హాడావిడి ఉండదని ఎన్‌టీఏ సూచించింది.