ఆగస్టు 15న స్వాతంత్రం జరుపుకునే 5 దేశాలివే..!

by Sathputhe Rajesh |   ( Updated:2023-08-14 07:32:42.0  )
ఆగస్టు 15న స్వాతంత్రం జరుపుకునే 5 దేశాలివే..!
X

దిశ, వెబ్‌డెస్క్: ఆగస్టు 15 భారత దేశానికి స్వాతంత్రం వచ్చిన రోజు. ఎంతో మంది త్యాగాలు, ఎన్నో వీరోచిత పోరాటల ఫలితంగా మనకు ఇండిపెండెన్స్ వచ్చింది. అయితే మనతో పాటు ఆగస్టు 15న రిపబ్లిక్ ఆఫ్ కాంగో, సౌత్ కొరియా, నార్త్ కొరియా, బహ్రెయిన్, లిచ్టెన్ స్టెన్ దేశాలు స్వాతంత్రం పొందాయి.

కాంగో : రిపబ్లిక్ ఆఫ్ కాంగోను కాంగో బ్రెజవిల్లేగా కూడా పిలుస్తారు. ఈ దేశం 1960 ఆగస్టు 15న ఫ్రాన్స్ దేశం నుంచి స్వాతంత్రం పొందింది.

సౌత్ కొరియా , నార్త్ కొరియా :

1945 ఆగస్టు 15న కొరియన్ పెనిన్సులా జపాన్ దేశం నుంచి స్వాతంత్రం పొందింది. అనంతరం రెండు దేశాలుగా విడిపోయింది. సౌత్ కొరియా, నార్త్ కొరియా ఆగస్టు 15న స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాయి.

లిచ్టెన్ స్టెన్ : లిచ్టెన్ స్టెన్ యూరప్ లో చిన్న దేశం. స్విట్జర్లాండ్, ఆస్ట్రియా మధ్యలో ఈ దేశం ఉంది. కాగా ఈ దేశం జర్మన్ పాలన నుంచి 1866 ఆగస్టు 15 న స్వాతంత్రం పొందింది. అయితే 1940 ఆగస్టు 15 వరకు ఈ దేశానికి స్వాతంత్రాన్ని అధికారికంగా ప్రకటించలేదు.

బహ్రెయిన్ : పెర్షియన్ గల్ఫ్ దేశమైన బహ్రెయిన్ బ్రిటీష్ పాలకుల నుంచి 1971 ఆగస్టు 15న స్వాతంత్రం పొందింది. అయితే ప్రతి దేశానికి సాంస్కృతికంగా, భౌగోళికంగా విశిష్టత ఉంది. పైన తెలిపిన ఐదు దేశాలు, భారతదేశంలో ఆగస్టు 15న స్వాతంత్ర దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటున్నాం. దేశ స్వాతంత్రం కోసం పోరాడిన వీరుల త్యాగాల స్ఫూర్తిగా నేటి తరం ముందుకు సాగుతోంది.

Advertisement

Next Story

Most Viewed