- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
16 మంది పోలీస్ అభ్యర్థులకు 41 సీఆర్పీసీ నోటీసులు.. పలు క్రిమినల్ కేసులు
దిశ, డైనమిక్ బ్యూరో : పోలీస్ రిక్రూట్మెంట్‌లో భాగంగా నిర్వహించిన ఎస్సై, కానిస్టేబుల్ ఈవెంట్స్‌లో రన్నింగ్‌లో క్వాలిఫై అయిన వారికి మెయిన్స్ రాసే అవకాశమివ్వాలని అభ్యర్థులు అసెంబ్లీ, ప్రగతి భవన్, డీజీపీ ఆఫీస్ ముట్టడికి యత్నించారు.
ఈ నేపథ్యంలో ముట్టడికి యత్నించిన 16 మందితో పాటు శాసనసభ పరిసరాల్లో నిరసన చేపట్టిన 12 మందిని అరెస్టు చేసిన పోలీసులు కేసులు నమోదు చేశారు. 16 మంది ఎస్సై, కానిస్టేబుల్ అభ్యర్థులపై 341,147,149,352,353 సెక్షన్స్‌తో పాటు పలు క్రిమినల్ కేసులను ఫైల్ చేశారు.
అనంతరం వారికి 41 సీఆర్పీసీ కింద నోటీసులు ఇచ్చి.. స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించారు. కాగా, శుక్రవారం ఆందోళన చేస్తున్న తమపై కేసులు పెడుతున్నారని అభ్యర్థుల ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలో ఎక్కడా లేని విధంగా లాంగ్ జంప్ 4 మీటర్లు చేశారని మండిపడ్డారు. తెలంగాణలో 2014, 2018 నోటిఫికేషన్‌లలో లాంగ్ జంప్ 3.8 మీటర్లు మాత్రమే ఉందని అన్నారు. తమ సమస్యను రిక్రూట్మెంట్ బోర్డు వెంటనే పరిష్కరించాలని కోరారు.