3897 మంది కాంట్రాక్ట్ ఉద్యోగులు రెగ్యులరైజ్.. ఉత్తర్వులు జారీ చేసిన సర్కార్

by Satheesh |
3897 మంది కాంట్రాక్ట్ ఉద్యోగులు రెగ్యులరైజ్.. ఉత్తర్వులు జారీ చేసిన సర్కార్
X

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ ఉన్నత విద్యాశాఖ‌లో వివిధ విభాగాల్లో ప‌ని చేస్తున్న 3897 మంది కాంట్రాక్ట్ ఉద్యోగుల‌ను క్రమబద్ధీకరిస్తున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ మేరకు మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో పనిచేస్తున్న 2532(సాంక్షన్డ్ పోస్టులు) మంది కాంట్రాక్ట్ లెక్చరర్లను రెగ్యులరైజ్ చేస్తున్నట్లు స్పష్టంచేసింది. అలాగే జూనియర్ కాలేజీలలో జనరల్ స్ట్రీమ్ వర్కింగ్‌లో భాగంగా విధులు నిర్వర్తించే 376 మంది కాంట్రాక్ట్ లెక్చరర్లు, వొకేషనల్ విభాగంలో పనిచేసే 184 మంది జూనియర్ లెక్చరర్లు, 251 మంది కాంట్రాక్ట్ డిగ్రీ లెక్చరర్లను రెగ్యులరైజ్ చేస్తున్నట్లు స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా నూతన స‌చివాల‌యం ప్రారంభోత్సవం సందర్భంగా కాంట్రాక్ట్ ఉద్యోగుల‌ క్రమబద్ధీకరణ ద‌స్త్రంపై ముఖ్యమంత్రి కేసీఆర్ తొలి సంత‌కం చేసిన విష‌యం తెలిసిందే. కాగా తాజాగా 3,897 మందిని రెగ్యులరైజ్ చేస్తున్నట్లు సర్క్యులర్ అందించడంపై పలువురు కాంట్రాక్ట్ ఉద్యోగులు హర్షం వ్యక్తంచేస్తున్నారు.

Advertisement

Next Story