- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఏ క్షణమైనా టీ కాంగ్రెస్ రెండో జాబితా.. ఈ 18 మంది బీసీ నేతలకు టికెట్ వరించేనా..?
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ కాంగ్రెస్‌లో బీసీ టికెట్ల డిమాండ్ కొనసాగుతోంది. తమకు మెజార్టీ సీట్లు కేటాయించాలని బీసీ నేతలు డిమాండ్ చేస్తోన్నారు. పార్టీలోని బీసీ నేతలు ప్రత్యేక సమావేశాలు నిర్వహించుకోవడంతో పాటు ఏఐసీసీ దృష్టికి టికెట్ల అంశాన్ని కూడా తీసుకెళ్లారు. బీజేపీ బీసీ అస్త్రాన్ని ప్రయోగిస్తోంది. బీసీ నేతలకు ఎక్కువ టికెట్లు కేటాయించాలనే నిర్ణయానికి వచ్చింది. దీంతో కాంగ్రెస్‌లో కూడా బీసీ డిమాండ్ మరింతగా వినిపిస్తోంది.
కాంగ్రెస్ నుంచి పలువురు బీసీ నేతలు టికెట్లపై ఆశలు పెట్టుకున్నారు. ఎల్బీనగర్ నుంచి మధుయాష్కీ గౌడ్, పరకాల నుంచి కొండా సురేఖ, వరంగల్ ఈస్ట్ నుంచి వెంకటస్వామి, శేరిలింగంపల్లి నుంచి జైపాల్, మక్తల్ నుంచి శ్రీహరి, దేవరకద్ర నుంచి ప్రదీప్, నర్సాపూర్ నుంచి అనిల్ కుమార్, నారాయణఖేడ్ నుంచి సురేష్ షెట్కార్, భువనగిరి నుంచి రామాంజనేయులు, ఆదిలాబాద్ నుంచి సుజాత, సూర్యాపేట నుంచి శ్రీనివాసయాదవ్, రాజేంద్రనగర్ నుంచి వేణుగోపాల్ ఆశావాహుల జాబితాలో ఉన్నారు.
ఇక సూర్యాపేట నుంచి శ్రీనివాసయాదవ్, జడ్చర్ల నుంచి శేఖర్, ముథోల్ నుంచి ఆనందరావు, పటాన్ చెరు నుంచి శ్రీనివాస్, హుస్నాబాద్ నుంచి ప్రభాకర్, మహమూబ్‌నగర్ నుంచి సంజీవ్ ముదిరాజ్ బీసీ కోటాలో టికెట్లను ఆశిస్తున్నారు. రేపు కాంగ్రెస్ ఎన్నికల కమిటీ మరోసారి భేటీ కానుండగా.. తుది జాబితాను విడుదల చేసే అవకాశముంది. దీంతో ఈ 18 మంది బీసీ నేతలను టికెట్లపై ఆశలు పెట్టుకున్నారు.