- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
22యేళ్లలో 170 చోరీలు.. ఘరానా దొంగ స్టైల్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!
దిశ, తెలంగాణ క్రైం బ్యూరో: అతని కన్ను పడిందా..? ఆ ఇంట్లో దొంగతనం జరగాల్సిందే. చిన్నపాటి ఇనుపరాడ్డుతో ఎలాంటి తాళాన్నయినా పగులగొట్టటం అతని ప్రత్యేకత. యుక్త వయసులోనే నేరాల బాట పట్టిన అతను ఇరవై రెండేళ్ల కాలంలో ట్రై కమిషనరేట్ల పరిధుల లోని వేర్వేరు పోలీస్స్టేషన్ల పరిధుల్లో నూటా డెబ్భయికి పైగా చోరీలు చేశాడు. ఈ క్రమంలో పలుమార్లు పోలీసులకు పట్టుబడ్డాడు. సిటీ డోషియర్క్రిమినల్షీట్తెరిచినా.. పీడీ యాక్ట్‌ప్రకారం కేసులు నమోదు చేసినా తన ప్రవృత్తిని మాత్రం మార్చుకోలేదు.
అతనే ఫలక్‌నుమా నవాబ్‌సాబ్‌కుంట నివాసి మహ్మద్‌సలీం అలియాస్సునీల్శెట్టి (46). తాజాగా అతన్ని మరోమారు అరెస్టు చేసిన ఫలక్‌నుమా పోలీసులు జరిపిన విచారణలో మరో పదిహేను ఇళ్లల్లో దొంగతనాలు చేసినట్టుగా అంగీకరించాడు. ఈ క్రమంలో పోలీసులు అతని వద్ద నుంచి 18.5 లక్షల రూపాయల విలువ చేసే ఇరవై తొమ్మది తులాల బంగారు నగలు, కిలోన్నర వెండి సామాగ్రి, ఓ ఇనుపరాడ్డు, కొంత నగదును స్వాధీనం చేసుకున్నారు. పోలీస్కమిషనర్సీ.వీ.ఆనంద్మంగళవారం పోలీస్కమాండ్కంట్రోల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు.
చెడు అలవాట్లకు బానిసై..
పోలీసువర్గాల్లో సునీల్శెట్టిగా ఫేమస్అయిన నిందితుడు యుక్త వయసులోనే చెడు అలవాట్లకు బానిసయ్యాడు. ఈ క్రమంలో కోరికలు తీర్చుకోవటానికి కావాల్సిన డబ్బు కోసం దొంగతనాల బాట పట్టాడు. సునీల్‌శెట్టి ప్రత్యేకత ఏంటంటే మధ్యతరగతి, దిగువ మధ్యతరగతికి చెందిన వారి ఇళ్లను మాత్రమే టార్గెట్చేయటం. ముందుగా ఆయా ప్రాంతాల్లో రెక్కీ చేసి తాళం వేసి ఉండి చోరీకి అనువైన ఇళ్లను ఎంచుకుని సునీల్‌శెట్టి నేరాలను పూర్తి చేసేవాడు. ఈ నేపథ్యంలో అతనిపై ఫలక్‌నుమా స్టేషన్‌లో సిటీ డోషియర్క్రిమినల్షీట్నమోదైంది.
గతంలో సునీల్‌శెట్టి అరెస్టు చేసిన కాంచన్బాగ్పోలీసులు అతనిపై పీడీ యాక్ట్‌ప్రకారం కేసులు కూడా నమోదు చేశారు. అయితే, అరెస్టయి జైలుకు వెళ్లి విడుదల కాగానే సునీల్‌శెట్టి నేరాలు చేయటాన్ని కొనసాగిస్తూ వచ్చాడు. కొంతకాలం క్రితం అరెస్టయి గత ఏడాది డిసెంబర్28న జైలు నుంచి బయటకు వచ్చిన సునీల్‌శెట్టి ఆ వెంటనే హైదరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పరిధుల్లో పదిహేను ఇళ్లల్లో చోరీలు చేశాడు. సునీల్‌శెట్టి గురించి విశ్వసనీయంగా సమాచారం అందటంతో ఫలక్‌నుమా ఇన్స్పెక్టర్రాఘవేంద్ర, డీఎస్ఐ దీన్దయాళ్సింగ్తో పాటు సిబ్బందితో కలిసి సోమవారం రాత్రి అతన్ని అరెస్టు చేశారు.