బ్రేకింగ్: TSPSC పేపర్ లీక్ నిందితులకు 14 రోజుల రిమాండ్

by Satheesh |
బ్రేకింగ్: TSPSC పేపర్ లీక్ నిందితులకు 14 రోజుల రిమాండ్
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రశ్నాపత్రం లీకేజీ కేసులో అరెస్టైన 9 మంది నిందితులకు నాంపల్లికోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది.దీంతో నిందితులను పోలీసులు చంచల్‌గూడ్ జైలుకు తరలించారు. అంతకుముందు ఉస్మానియా ఆసుపత్రిలో 9 మందికి వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం నాంపల్లి కోర్టులో హాజరుపరచగా, కోర్టు వారికి రిమాండ్ విధించింది. కాగా, ఈ నెల 5వ తేదీన జరిగిన ఏఈ పరీక్ష ప్రశ్నాపత్రం లీకైనట్టుగా పోలీసులు గుర్తించారు. దీంతో ఈనెల 12న జరగాల్సిన టౌన్ ప్లానింగ్ ఓవర్సీస్ పరీక్ష, 15, 16 తేదీల్లో వెటర్నరీ అసిస్టెంట్ పరీక్షలను టీఎస్పీఎస్సీ వాయిదా వేసింది. ఈ రెండు పరీక్షల ప్రశ్నాపత్రాలు లీకయ్యాయా లేదా అనే విషయమై నిర్ధారణ కావాల్సి ఉందని పోలీసులు ప్రకటించారు.

ప్రవీణ్ వద్ద పేపర్ నకళ్లు..

టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసు రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. ఏఈ, టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్సీర్ పేపర్లను టీఎస్పీఎస్సీ ఉద్యోగి ప్రవీణ్ తన వద్ద ఉంచుకున్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. నిందితుడు ప్రవీణ్ పోలీసుల విచారణలో నేరాన్ని అంగీకరించాడు. దీంతో ఏఈ పేపర్ నకళ్లు ప్రవీణ్ నుంచి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్సీర్ పేపర్ నకళ్లు సైతం ప్రవీణ్ వద్ద స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

టీఎస్పీఎస్సీ ప్రధాన సర్వర్ నుండి పేపర్ కొట్టేసిన ప్రవీణ్.. ప్రింట్ తీసి రేణుకు ఇచ్చినట్లు పోలీసులు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. ప్రవీణ్ దగ్గరి నుండి పేపర్ తీసుకున్న రేణుకు కుటుంబ సభ్యులు ఒక్కొ పేపర్‌ను రూ. 20 లక్షలకు అమ్మేందుకు సిద్ధపడ్డారు. ఇద్దరు అభ్యర్థులు పేపర్ కొనడానికి ముందుకు రాగా.. వారిని తమ ఇంట్లో నుండి ఉంచి ప్రిపేర్ చేయించిన రేణుక ఈ విషయం బయటపడకుండా జాగ్రత్త పడింది. అంతేకాకుండా పరీక్ష రోజున పేపర్ కొన్న ఆ ఇద్దరు అభ్యర్థులను ఎగ్జామ్ సెంటర్ వద్ద కూడా రేణుకానే డ్రాప్ చేసిందని పోలీసులు రిమాండ్ రిపోర్ట్‌లో పేర్కొన్నారు.

Advertisement

Next Story

Most Viewed