నేటి ఇంటర్ పరీక్షలకు 13వేల మంది గైర్హాజరు

by M.Rajitha |   ( Updated:2025-03-12 17:28:36.0  )
నేటి ఇంటర్ పరీక్షలకు 13వేల మంది గైర్హాజరు
X

దిశ, తెలంగాణ బ్యూరో : ఇంటర్ సెకండ్ ఇయర్ పరిక్షలకు 13,258 విద్యార్ధులు గైర్హజరు అయినట్లు తెలంగాణ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్(ఐపిఈ) సెక్రటరి వెల్లడించారు. బుధవారం నిర్వహించిన మాధమెటిక్స్ , బోటని, పోలిటికల్ సైన్స్ పరిక్షకు 4,54,031 మంది విద్యార్ధులు హజరైటన్లు తెలిపారు.. పరిక్ష పత్రంలో ‘ ఏ ’ సెట్ పేపర్ విద్యార్ధులకు అందజేసినట్లు తెలిపారు. మాల్ ప్రాక్టీస్ క్రింద మూడు కేసులు నమోదైనట్లు తెలిపారు. నిజామాబాద్ లో రెండు కేసులు, సిద్దిపేటలో ఒక కేసు నమోదు చేసినట్లు వెల్లడిచారు. బోర్డు నుండి మంచిర్యాల, ఖమ్మం, రంగారెడ్డి, యాదాద్రి, హైదరాబాద్ జిల్లాలకు పరీక్షా కేంద్రాలకు పరిశీలకులను పంపినట్లు తెలిపారు. పరిక్షలు సజావుగా, ప్రశాంతంగా జరిగాయని, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు లేకుండా నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

Next Story