కిషన్ రెడ్డి, బండి సంజయ్‌కి స్పెషల్ థాంక్స్: MLC అభ్యర్థి అంజిరెడ్డి

by Gantepaka Srikanth |
కిషన్ రెడ్డి, బండి సంజయ్‌కి స్పెషల్ థాంక్స్: MLC అభ్యర్థి అంజిరెడ్డి
X

దిశ, వెబ్‌డెస్క్: గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నిక(Graduate MLC Elections)ల్లో గెలుపు అనంతరం తొలిసారి బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి(MLC Candidate Anji Reddy) మీడియాతో మాట్లాడారు. ‘నాకు 97,880 ఓట్లు వచ్చాయి. ఐదు వేలకు పైగా ఓట్ల మెజార్టీతో గెలిచాం. ఎవరికైతే ఎక్కువ ఓట్లు వస్తాయో రూల్ ప్రకారం వారే విజేతలు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో నాకు ఓటు వేసిన ప్రతీ ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు. ముఖ్యంగా కిషన్ రెడ్డి(Kishan Reddy), బండి సంజయ్‌(Bandi Sanjay)కి స్పెషల్ థాంక్స్’ అని అంజిరెడ్డి మాట్లాడారు. ఇదిలా ఉండగా.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపుతో కరీంనగర్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో బీజేపీ శ్రేణులు సంబురాలు జరుపుకున్నారు. రంగులు పూసుకుని, స్వీట్లు పంచుకున్నారు. కౌంటింగ్ కేంద్రం నుంచి బయటకు వచ్చిన బండి సంజయ్, ఎమ్మెల్సీ అభ్యర్థి అంజిరెడ్డికి గ్రాండ్ వెల్‌కమ్ చెప్పారు. అనంతరం వారిద్దరిని భుజాలపై ఎత్తుకొని ఊరేగించారు. కాసేపట్లో అంజిరెడ్డి గెలుపు ధ్రువీకరణ పత్రం(Certificate of victory) అందుకోనున్నారు.

Next Story