హనుమాన్ జయంతి వేళ ఎమ్మెల్యే రాజాసింగ్ అరెస్ట్...

by Mahesh |   ( Updated:2023-04-06 07:19:25.0  )
హనుమాన్ జయంతి వేళ ఎమ్మెల్యే రాజాసింగ్ అరెస్ట్...
X

దిశ, వెబ్‌డెస్క్: హనుమాన్ జయంతి ఉత్సవాల్లో పాల్గొనున్న ఎమ్మెల్యే రాజా సింగ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాజాసింగ్ పోలీసులతో వాగ్వాదానికి దిగారు.. ప్రతి ఏడాది హనుమాన్ జయంతి ఉత్సవాల్లో బైక్ ర్యాలీలో పాల్గొంటాను. ఎందుకు అరెస్ట్ చేస్తున్నారో పోలీసులు చెప్పాలని రాజా సింగ్ పోలీసులను ప్రశ్నించారు. తెలంగాణలో వ నిజాం రజాకార్ల పోలీసుల వలే హిందువులను అణిచివేయాలని చూస్తున్నారని ఆరోపించారు. అలాగే నన్ను అరెస్ట్ చేస్తే.. హనుమాన్ భక్తులు విద్వంసం సృష్టిస్తే నేను బాధ్యుడని కానని రాజా సింగ్ పోలీసులకు సూచించారు. కాగా బండి సంజయ్ రిమాండ్ నేపథ్యంలో రాజా సింగ్ హనుమాన్ శోభా యాత్రలో పాల్గోంటే.. సమస్యలు ఉత్పన్నం కావచ్చని పోలీసులు ఆయనను ముందస్తు అరెస్ట్ చేస్తున్నట్లు సమాచారం అందుతుంది.

Advertisement

Next Story

Most Viewed