- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
దారి చూపాలని కేంద్రాన్ని కోరిన తెలంగాణ
దిశ, తెలంగాణ బ్యూరో : వానాకాలం ప్రారంభం కావడంతో కృష్ణా జలాల నీటి వాటాలు, పంపిణీ, ప్రాజెక్టుల వారీ కేటాయింపులపై కేంద్ర ప్రభుత్వమే పరిష్కారం చూపాలని తెలంగాణ ప్రభుత్వం కోరుతున్నది. ఈ మేరకు కేంద్ర జలవనరుల శాఖ కార్యదర్శికి రాష్ట్ర సాగునీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఒక రోజు ముందు లేఖ రాశారు. కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర షెకావత్ గతేడాది అక్టోబరు 6వ తేదీన రెండు రాష్ట్రాల ముఖ్యంత్రులతో నిర్వహించిన అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో ఇచ్చిన హామీ మేరకు సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ను ఉపసంహరించుకున్నట్లు ఆ లేఖలో ప్రస్తావించారు. ఇకపైన తెలంగాణకు కృష్ణా జలాల సమస్యలను పరిష్కరించడానికి ఉన్న ఏకైక మార్గం కేంద్ర ప్రభుత్వం మాత్రమేనని పేర్కొన్నారు.
తెలంగాణ ఏర్పడిన నెల రోజులకే ముఖ్యమంత్రి కేసీఆర్ కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. తెలంగాణకు కృష్ణా జలాల కేటాయింపులో జరిగిన అన్యాయాన్ని పరిష్కరించాలని, అంతర్ రాష్ట్ర జల వివాదాల చట్టంలోని సెక్షన్-3 కింద అప్పటి కేంద్ర జలవనరుల మంత్రిత్వశాఖకు ఫిర్యాదు చేశారు. ఆ సెక్షన్ ప్రకారం ఫిర్యాదు అందిన ఏడాదిలోగా కేంద్ర ప్రభుత్వం పరిష్కారం చూపాల్సి ఉందని, కానీ అలాంటి పరిష్కారం రాకపోవడంతో సెక్షన్-4 ప్రకారం సుప్రీంకోర్టులో పిటిషన్ వేయాల్సి వచ్చిందని ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆ లేఖలో పేర్కొన్నారు. ఇప్పుడు ఆ లేఖను ఉపసంహరించుకున్నందున ప్రస్తుతం ప్రాజెక్టులవారీ నీటి కేటాయింపుల అంశాన్ని విచారిస్తున్న జస్టిస్ బ్రిజేశ్ కుమార్ ట్రిబ్యునల్ పరిధిని విస్తరించి ఈ అంశాన్ని అదనంగా అప్పగిస్తారా, కేంద్ర ప్రభుత్వమే చొరవ తీసుకుని పరిష్కరించనుందో నిర్ణయించాలని ఆ లేఖలో కోరారు.
ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్ 89 ప్రకారం జస్టిస్ బ్రిజేశ్ కుమార్ ట్రిబ్యునల్‌కు కేవలం ప్రాజెక్టులవారీ నీటి కేటాయింపులు చేసే బాధ్యతలను మాత్రమే ప్రభుత్వం ఇచ్చిందని, సమైక్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విభజనకు గురై తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు ఏర్పడినందున ఎగువన ఉన్న కర్నాటక, మహారాష్ట్రలకు ఇబ్బంది లేకుండా రెండు కొత్త రాష్ట్రాలకు మాత్రమే నీటి కేటాయింపులు చేసే అధికారం ఆ ట్రిబ్యునల్‌కు ఇవ్వలేదని తెలంగాణ తన తాజా లేఖలో ప్రస్తావించింది. ఇలాంటి పరిస్థితుల్లో కొత్తగా ట్రిబ్యునల్ ఏర్పాటు చేయడం లేదా జస్టిస్ బ్రిజేశ్ కుమార్ ట్రిబ్యునల్‌కే అంతర్ రాష్ట్ర నదీ జలాల వివాదాల చట్టం కింద రెండు కొత్త రాష్ట్రాలకు నీటి పంపకాలు చేసే బాధ్యతలను అప్పగించాలని ఈ లేఖలో తెలంగాణ నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి విజ్ఞప్తి చేశారు.