- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కేసీఆర్ చెప్పింది అబద్దమా.. పోలీసులను నిలదీసిన మహిళలు (వీడియో)
దిశ, డైనమిక్ బ్యూరో : పెరుగుతున్న పెట్రో ధరలు, గ్యాస్ సిలిండర్ ధరలు సామాన్యుడికి భారంగా మారిన వేళ కేంద్రం పెట్రో ధరలపై ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించి కొంత ఉపశమనాన్ని కలిగించింది. కేంద్ర ప్రభుత్వం నిర్ణయాన్ని స్వాగతిస్తూ దాదాపు 24 రాష్ట్రాలు (17 రాష్ట్రాలు, 7 కేంద్ర పాలిత ప్రాంతాలు) తమ రాష్ట్రాల్లో వ్యాట్‌ను కొంత మేర తగ్గించాయి. అయితే, తెలుగు రాష్ట్రాలు మాత్రం వీటిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఈ క్రమంలో గత రెండు రోజులుగా సీఎం కేసీఆర్ ప్రెస్ మీట్‌లు నిర్వహించి కేంద్రం పూర్తిగా ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించాలని, గ్యాస్ ధరలు తగ్గించాలని డిమాండ్ చేశారు.
ఈ క్రమంలోనే ధరల తగ్గించకపోతే రోడ్డెక్కి ధర్నాలు చేస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. ఏకంగా రాష్ట్ర ప్రభుత్వమే పెట్రో ధరలు, గ్యాస్ సిలిండర్ ధరలను తగ్గించేందుకు ధర్నా చేస్తామని చెప్పడం విశేషం. దీంతో హైదరాబాద్‌లో ఉన్న పౌరసరఫరాల కమిషనర్ ఆఫీస్ ముందు సోమవారం మహిళలు ధరల తగ్గింపుపై ధర్నాకు దిగారు. ఈ నేపథ్యంలో పోలీసులు వారిని అడ్డుకొని అరెస్ట్ చేశారు. అయితే, కేంద్రంపై యుద్ధం చేస్తామని ప్రకటించి.. ధర్నా చేసేందుకు వచ్చేవారిని ఎలా అరెస్ట్ చేస్తారంటూ పోలీసుల తీరుపై నెటిజన్లు తీవ్రంగా మండిపడుతున్నారు.
ఓ వైపు ప్రభుత్వమే ధర్నాకు దిగుతుందని కేసీఆర్ చెబుతుంటే.. పోలీసులు మాత్రం ధర్నా చేస్తున్న వారిని ఎందుకు అరెస్ట్ చేస్తున్నారంటూ మహిళలు సైతం ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాకుండా, పెట్రోల్ ధరలు, నల్ల చట్టాలతోపాటు రాష్ట్రంలోని రోడ్ల పరిస్థితి, కరోనా మరణాల గుర్తింపుపై దృష్టిసారించాలంటూ నెటిజన్లు ట్వీట్లు చేస్తున్నారు.
These women were arrested for ‘trying’ to protest against fuel price hike & question about gas subsides at Civil Supplies Comissioner’s office ysday morning. Listen to the women speak, ‘don’t know where they are taking us. Fine, will see what you will do’. #CMKCR #Telangana
— Revathi (@revathitweets) November 9, 2021